Friday, November 15, 2019

PF withdraw precautions



Read also:


PF డబ్బును ముందుగానే విత్‌డ్రా చేస్తున్నారా-నష్టపోతారు జాగ్రత్త

పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసేందుకు రెడీ అయ్యారా?అయితే మీరు ఒక విషయం తెలుసుకోండిపీఎఫ్ మొత్తాన్ని ముందుగానే తీసుకుంటే నష్టపోవాల్సి ఉంటుందిపన్ను భారం పడుతుంది
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనం. వేతన జీవులు ఈపీఎఫ్ అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందొచ్చు. ప్రతి నెలా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. అలాగే కంపెనీ కూడా ఉద్యోగి కంట్రిబ్యూషన్‌‌కు సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది.
రుణం.సిబిల్ స్కోర్‌తో పనిలేదు.
pf-withdraw

పీఎఫ్ డబ్బులను ఐదేళ్ల సర్వీస్ తర్వాత విత్‌డ్రా చేసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు. పీఎఫ్ మెచ్యూరిటీ అమౌంట్‌పై పన్ను మినహాయింపు ఉంది. అయితే ఐదేళ్లకు ముందుగానే పీఎఫ్ డబ్బులు తీసుకుంటే.. అప్పుడు ఉద్యోగి కంట్రిబ్యూషన్‌, దీనిపై అర్జించిన వడ్డీ, కంపెనీ కంట్రిబ్యూషన్, దీనిపై వచ్చిన వడ్డీ వంటి అన్నింటికీ పన్ను వర్తిస్తుంది.
పీఎఫ్ ఎంప్లాయి కంట్రిబ్యూషన్‌కు సెక్షన్ 80సీ ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది. 5 ఏళ్లకు ముందుగానే పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకుంటే.అప్పుడు సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు వర్తించదు. అంటే మీరు పొందిన పన్ను మినహాయింపు మళ్లీ మీ ఆదాయానికి జతవుతుంది. దీన్ని శాలరీ ఆదాయంగా పరిగణిస్తారు. అలాగే కంపెనీ కంట్రిబ్యూషన్, అర్జించిన వడ్డీకి కూడా ఇది వర్తిస్తుంది.
పీఎఫ్ డబ్బులను ఐదేళ్లకు ముందుగానే తీసుకుంటే ట్యాక్స్ పడుతుంది. అందుకనే ఐదేళ్ల వరకు వేచి చూసి అటుపైన అవసరం అనుకుంటే పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోండి. ఉద్యోగం మారేసమయంలో కూడా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవద్దు. ట్రాన్స్‌ఫర్ మాత్రమే చేసుకోండి. ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :