Tuesday, November 26, 2019

New features with M-Aadhar application



Read also:

ఈరోజుల్లో ప్రతీ పనికి ఆధార్ అవసరం. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి పాసుపోర్టు వరకు ఆధార్ అవసరం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలిసీ తెలియక మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మన ఆధార్ కార్డు వివరాలు దుర్వినియోగం అవుతున్నాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక కొత్త ఆధార్ యాప్ ను తీసుకువచ్చింది దీని పేరే 'ఎం ఆధార్'. చాలా కొత్త ఫీచర్లను ఈ యాప్ లో తీసుకువచ్చారు. ప్రస్తుతం వాడుతున్న ఆధార్ యాప్ ని తొలగించి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకువాల్సిందిగా ప్రభుత్వం చెప్పింది. 

మరి ఈ కొత్త యాప్‌లో అందుబాటులోకి వచ్చిన ఫీచర్లు ఏమిటో ఓ సారి చూద్దాం


  • ఆధార్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తరువాత మొబైల్‌ నంబర్‌ను అడుగుతుంది.
  • మీరు ఆధార్‌ను ఏ నంబర్‌తో నమోదు చేసుకున్నారో అది ఇవ్వాలి.
  • ఓటీపీని నమోదు చేయాలి. తర్వాత యాప్‌లోకి వెళ్లిన తర్వాత మీ ఆధార్‌ కార్డు సంఖ్యను నమోదు చేయాలి. అప్పుడు కూడా ఓటీపీ వస్తుంది. 
  • దానిని ఎంటర్‌ చేయాలి. దీంతో మీ ఆధార్‌ను యాప్‌కు అనుసంధానం చేసినట్లు అవుతుంది.

భద్రతకు డోకా లేదు


  • యాప్ లో ఎవ్వరూ మీ ఆధార్ వివరాలు చూడకుండా లాక్ చేసుకోవచ్చు.
  • మై ఆధార్‌ను ఓపెన్‌ చేయాలంటేనే లాక్‌ కోడ్‌ అవసరమవుతుంది.
  • నాలుగు అంకెలతో కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.
  • లోపలికి వెళ్లిన తర్వాత 'సెట్‌ ఆధార్‌ లాక్‌'అనే ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేసుకుని వర్చువల్‌ ఐడీని సృష్టించుకోవాలి.
  • వర్చువల్ ఐడీ జనరేట్‌ చేసేటప్పుడు సెక్యూరిటీ క్యాప్షన్‌ కనిపిస్తుంది.
  • దానిని ఎంటర్‌ చేయాలి. అప్పుడు వన్ టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీని నమోదు చేస్తే వర్చువల్‌ ఐడీ క్రియేట్‌ అవుతుంది.
  • దానిని నోట్‌ చేసి పెట్టుకోవాలి. ఆధార్‌ లాక్‌ను ఓపెన్‌ చేయాలంటే వర్చువల్‌ ఐడీ తప్పనిసరి. ఒక వేళ వర్చువల్ ఐడి మర్చిపోతే 1947కు మెసేజ్‌ పంపి తిరిగి పొందవవచ్చు.
  • దీని కోసం 'ఆర్ వి ఐ డి' అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ లోని చివరి నాలుగు అంకెలు టైపు చేసి 1947 కి మెసేజ్ పంపాలి.
  • ఇంకా ఈ ఆధార్ యాప్ ను ఫింగర్ ప్రింట్ లాక్ కూడా చేసుకోవచ్చు.
  • ఇందుకోసం ఆధార్ యాప్ లో బయోమెట్రిక్స్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఇక వీటితో పాటు ఆధార్‌ డౌన్లోడ్, ఆధార్‌ రీప్రింట్‌, అప్‌డేట్‌ అడ్రస్‌ ఆన్‌లైన్‌, ఆధార్‌ స్టేటస్‌ సర్వీస్‌ వంటి సర్వీసులను పొందవచ్చు.
  • ఆధార్ కేంద్రానికి వెళ్లకుండా ఇంట్లోనే ఈ పనులన్నీ చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :