Thursday, November 7, 2019

Indian navy recruitment@2700 jobs



Read also:

భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్‌ నేవీలో సెయిలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి 2020 ఆగస్టులో ప్రారంభం కానున్న ఆర్టిఫిసర్ అప్రెంటిస్(AA), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) బ్యాచ్‌ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

Notification Details

సెయిలర్స్ - AA & SSR - ఆగ‌స్టు 2020 బ్యాచ్
మొత్తం ఖాళీలు: 2700
ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌ (AA): 500 పోస్టులు
సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌ (SSR): 2200 పోస్టులు
అర్హత: ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.08.2000 - 31.07.2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రాల వారీగా రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు.

Online Exam Information

  • మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
  • పరీక్ష పేపర్‌లో నాలుగు విభాగాల నుంచి పశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు విడిగా అన్ని విభాగాల్లోనూ నిర్దిష్ట అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
  • హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
  • ఇంటర్ స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు.
  • 60 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది.
  • పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పుసమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒకమార్కు కోత విధిస్తారు.

Training Details

  • ఎంపికైన అభ్యర్థులకు 2020 ఆగస్టు నుంచి శిక్షణ ప్రారంభిస్తారు.
  • ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌ (AA) అభ్యర్థులకు 9 వారాలపాటు, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌ (SSR) అభ్యర్థులకు 22 వారాలపాటు ఒడిశాలోని ఐఎన్‌ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుంది.
  • అభ్యర్థులకు ప్రొఫెషనల్ ట్రైనింగ్‌తోపాటు ఇతర నావికాదళ శిక్షణ కూడా ఉంటుంది. శిక్షణ తదనంతరం సర్వీసు అవసరాల మేరకు అభ్యర్థులకు బ్రాంచ్/ ట్రేడ్‌ను కేటాయిస్తారు.
  • శిక్షణ సమయంలో ప్రవర్తన సరిగాలేకపోయినా, అభ్యర్థి సమర్పించిన సర్టిఫికేట్లు నకిలీవని తేలినా వారి నియామకాన్ని రద్దుచేస్తారు.
  • విజయవంతగా శిక్షణ పూర్తిచేసుకున్న ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు 20 సంవత్సరాలు, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌ అభ్యర్థులకు 15 సంవత్సరాల పాటు సర్వీసు ఉంటుంది.

Impportant Dates

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 08.11.2019
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 18.11.2019

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :