Thursday, November 7, 2019

Increase rental prices in Tirumala



Read also:

Increase rental prices in Tirumala

  • కలియుగ వైకుంఠం తిరుమలలో మధ్యతరగతికి వసతి విషయంలో మరింత భారం పడనుంది. ఇప్పటి వరకు తిరుమలలో అందుబాటులో ఉండే నందకం అద్దె గదులను రూ.600 నుంచి రూ.1000కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
  • అంతేకాకుండా కౌస్తుభం, పాంచజన్యంలో రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. పెంచిన ధరలను ఇవాళ్టి నుంచే తితిదే అమల్లోకి తీసుకొచ్చింది.
  •  శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3వేల వరకు వసతి సదుపాయం ఉంది. ఆన్‌లైన్‌, ఈ దర్శన్‌ల ద్వారా ప్రస్తుతం రూ.100, రూ.500, రూ.600, రూ.999, రూ.1500 వసతిని మాత్రమే కేటాయించేవారు.
  • వీటిలో రూ.100, రూ.500, రూ.600 సాధారణ వసతికాగా, రూ.999, రూ.1500 ఏసీ సదుపాయంతో కూడినవి.
  • తిరుమల వెళ్లే భక్తులు అత్యధిక శాతం రూ.100 గదుల్లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. అయితే రూ.100 వసతి గదులు చాలా తక్కువగా కేటాయించటంతో అవి దొరకని వారు రూ.500, రూ.600 వసతిని పొందేవారు. మధ్య, ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో ఉండేవి.

తిరుపతిలో యథావిధిగా

తిరుమలలో వసతిని పెంచినా తిరుపతిలో మాత్రం యథావిధిగా ఉంచారు. శ్రీనివాసం సాధారణ గది రూ.200, ఏసీ రూ.400, డీలక్స్‌ ఏసీ రూ.600, మాధవంలో ఏసీ రూ.800, డీలక్స్‌ ఏసీ రూ.1000, తిరుచానూర్‌(పద్మావతి అమ్మవారి ఆలయం)లో ఏసీ రూ.300, సాధారణ గది రూ.100 చొప్పున ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ల ద్వారా కేటాయిస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :