Saturday, November 23, 2019

HPCL Recruitment 2019



Read also:

హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విశాఖపట్నంలోని రిఫైనరీలో ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌పీసీఎల్. ఇవాళ హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2019 డిసెంబర్ 21 చివరి తేదీ.

Notification Details

మొత్తం ఖాళీలు- 72
ఆపరేషన్స్ టెక్నీషియన్- 66
బాయిలర్ టెక్నీషియన్- 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 21
విద్యార్హత- సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :