Thursday, November 28, 2019

Hidden secrets of cooking oil



Read also:

మీ ఇంట్లో ఏ వంట నూనె వాడుతున్నారు.. పల్లీల నూనె, సన్ ఫ్లవర్ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె.. వీటిలో ఏది ఎంచుకోవాలో తెలియట్లేదా? అయితే, ఈ విషయం పూర్తిగా చదివాక మీరే సరైన నిర్ణయం తీసుకొండి.. వెజిటెబుల్ ఆయిల్స్ లో అనగానే సన్ ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్ మనకి టక్కున గుర్తొస్తాయి..కానీ, వీటిని వాడితే క్యాన్సర్ కారక వ్యాధులు వస్తాయంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.. వీటికంటే కొబ్బిరినూనె, ఆలివ్ నూనె, వెన్నలను ఉపయోగించడం మంచిదని వారు సూచిస్తున్నారు

వెటిటెబుల్ బేస్డ్ ఆయిల్స్ ని ఎక్కువగా వేడి చేసినప్పుడు అవ్వి అల్డీహైడ్స్ అనే కెమికల్స్ ని విడుదల చేస్తాయి.. వీటివల్ల గుండెకి సంబంధించిన వ్యాధులే కాకుండా.


క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని స్టడీస్ చెబుతున్నాయి. వీటి బదులుగా ఆలివ్ ఆయిల్, బటర్ ని వాడినప్పుడు తక్కువ మోతాదులో అల్డిహైడ్స్ విడుదలైనట్టు పరిశోధనల్లో తేలింది.. ఎక్కువ మోతాదులో వెజిటెబుల్ ఆయిల్స్ ని భోజనంలో తీసుకున్నప్పుడు, మన బ్రెయిన్ కూడా ఎక్కువ శాతం ఒమేగా6 ను తీసుకుంటుంది. అంతేకాకుండా ఎంతో ఉపయోగకరమైన ఒమేగా3ని వదిలేస్తుంది.. దీనివల్ల మానసిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది.

వెజిటెబుల్ ఆయల్స్ అన్నిటినీ వివిధ టెంపరేచర్స్ లో టెస్ట్ చేసిన తరువాతే ఈ విషయాన్ని వెల్లడించారు.. అందుకే ఏదైనా డీప్ ఫ్రైలు చేసుకోవల్సి వచ్చినప్పుడు వెజిటెబుల్ ఆయిల్స్ కి బదులుగా, వెన్న, ఆలివ్ ఆయిల్స్ ని వాడుకుంటే మంచిదని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతూ ఉంటే మీరు మరిన్ని రోగాలను ఆహ్వానించేనట్టే అవుతుందని కూడా చెబుతున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :