Friday, November 15, 2019

Good news for tax payers



Read also:

పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను ఫాం జీఎస్‌టీఆర్-9 (వార్షిక రిటర్న్), ఫామ్ జీఎస్‌టీఆర్-9సి (సయోధ్య ప్రకటన) ఫైలింగ్ గడువును పొడిగించింది. 2017-18కి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు గడువు పెంచగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అలాగే, ఈ ఫాంలను మరింత సులభతరం చేసేందుకు కొన్ని అంశాలను ఆప్షనల్ చేసింది.గడువు పొడిగింపుతో జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులందరూ నిర్ణీత సమయంలోనే తమ వార్షిక రిటర్న్స్‌ను దాఖలు చేస్తారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) భావిస్తోంది. నిజానికి 2017-18 సంవత్సరానికి జీఎస్‌టీఆర్-9, జీఎస్‌టీఆర్-9సి ఫైలింగ్ గడువు ఈ నెల 30తో ముగియనుండగా, 2018-19 సంవత్సరానికి డిసెంబరు 31తో ముగియనుంది. ఇప్పుడు ప్రభుత్వ తాజా ప్రకటనతో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించినట్టు అయింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :