Friday, November 15, 2019

Good news for Aadhar card holders



Read also:

ఆధార్ వినియోగదారులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం


ఆధార్ వినియోగదారులకు కేంద్రం ఓ తిపి కబురు అందించింది. మనలో ఎక్కువ శాతం ప్రజలు ఉపాధినిమిత్తం ఒకచోటు నుండి మరో చోటుకు వెళ్లుతుంటారు కదా వారి కోసమే ఈ గుడ్ న్యూస్. ఇకపోతే చాల మందికి ఆధార్‌లో ఉన్న అడ్రస్‌కు ప్రస్తుతం వారుంటున్న చిరునామకు సంబంధం ఉండదు. ఎందుకంటే ఆధార్ కోసం సొంతూరి చిరునామా ఇచ్చి.. ఉపాధి కోసం పట్టణాలకు వచ్చి స్థిరపడేవారే ఎక్కువ. ఇలా ఉన్న వారికి అడ్రస్ ప్రూఫ్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అంతే కాకుండా ఐడీ ప్రూఫ్ ఇవ్వడానికి, కేవైసీ సమర్పించడానికి చాలా తిప్పలు పడుతుంటారు కూడా. ఇక ఇలాంటి ఇబ్బందులను అధిగమించడం కోసం కేంద్రం.ఆధార్‌కు సంబంధించి ఓ కీలక సవరణ తీసుకొచ్చింది.దీని ప్రకారం మీరు ఉంటున్న అడ్రస్.ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ వేర్వేరుగా ఉన్నప్పటికీ. కేవైసీ కోసం ఆధార్ నంబర్ ఇవ్వొచ్చు. అదెలాగంటే ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ సంఖ్యనే ఉపయోగించి కేవైసీ కోసం మీరు ప్రస్తుతం ఉంటోన్న ఇంటి అడ్రస్ ఇచ్చేలా.కేంద్రం వెసులుబాటు కల్పించింది.
కాకపోతే సెల్ఫ్ డిక్లరేషన్ ఇలా అడ్రస్ ప్రూఫ్ ఇచ్చే వ్యక్తులు ఇవ్వాల్సి ఉంటుంది. బుధవారం ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ గెజిట్ ప్రచురించింది. కేంద్రం నిర్ణయంతో ఇక మీదట ప్రస్తుత లేదా స్థానిక చిరునామా కోసం ఆధార్‌లో ఉన్న శాశ్వత చిరునామాను మార్చుకోవాల్సిన అవసరం ఉండదని ఓ అధికారి తెలిపారు. ఇకపోతే ఈ మద్యకాలంలో ఆధార్ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి.
వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది. ఇకపోతే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉపాధి కోసం వలస వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఆధార్‌లో శాశ్వత చిరునామా ఉంటే.. ప్రస్తుత అడ్రస్ బ్యాంక్ ఖాతాలో ఉంటుందన్న మాట.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :