Thursday, November 21, 2019

ap ssc public examination marh-2020 fee details & instructions



Read also:

వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రుసుం చెల్లించేందుకు డిసెంబరు 5 వరకు గడువు.
నిర్ణీత గడువు అనంతరం రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబరు 12 వరకు,
రూ. 200తో 23 వరకు, రూ.500తో జనవరి 2వ తేదీ వరకు గడువు.
రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ. 125 చెల్లించాలి.
మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టులకు రూ. 110, మూడుకన్నా ఎక్కువ సబ్జెక్టులకు రూ. 125 చొప్పున పరీక్షల రుసుం చెల్లించాలి.
పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన నామినల్‌రోల్స్‌ లింకు www.bseap.org వెబ్‌సైట్‌లో ఈనెల 21 నుంచి అందుబాటులో ఉంటాయని ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 2019 ఆగస్టు 31 నాటికి 14 సంవత్సరాల వయస్సు నిండివుండాలి.
పురపాలక, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు నిర్ణీత వయస్సుకంటే ఆరు మాసాలు, ఒక ఏడాది వయస్సు తక్కువగావుంటే సదరు విద్యార్థులకు వయస్సు మినహాయింపు నిమిత్తం ప్రతిపాదనలను ఈనెల 25వ తేదీలోగా డీఈవో కార్యాలయానికి పంపి తగిన అనుమతులు పొందాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.
fees-pay

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :