Friday, November 8, 2019

AP grama/ward volunteers rules



Read also:

సచివాలయ ‘కార్యదర్శుల’ సర్వీస్‌ రూల్స్‌ విడుదల
సెలవులిచ్చే, తప్పు చేస్తే శిక్షించే అధికారం కమిషనర్లదే
పట్టణాల్లోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించేందుకుగాను ఇటీవల రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన వివిధ కేటగిరీల వార్డు కార్యదర్శులు తమ ప్రొబేషనరీ కాలంలో నిర్వహించే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి! లేకుంటే వారిని సర్వీస్‌ నుంచి తప్పిస్తారు! ఏవైనా గ్రామపంచాయతీలు కొత్తగా పురపాలక సంఘాలు లేదా నగర పాలక సంస్థల్లో కలిస్తే అప్పటికే వాటిల్లో వార్డు కార్యదర్శులకు పోలిన విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను (వారు ఇష్టపడితేనే) తగిన కేటగిరీ వార్డు కార్యదర్శులుగా నియమిస్తారు. ఇలాంటి వారు అప్పటికే పూర్తి చేసిన సర్వీసును ఈ విషయంలోపరిగణనలోకి తీసుకుంటారు. వార్డు కార్యదర్శులకు సంబంధించిన ఉద్యోగ నిబంధనలు, సర్వీసు రూల్స్‌ను వివరంగా పేర్కొంటూ ‘ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ జనరల్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌-2019’ పేరిట పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పైనపేర్కొన్న అంశాలు కొన్ని! వివరాలిలా ఉన్నాయి.
  • వార్డు కార్యదర్శులను 5 క్లాసులుగా పేర్కొన్నారు. వీటిల్లో మినిస్టీరియల్‌ క్లాస్‌ కింద వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ- వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ; ప్రజారోగ్యం కింద శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2); ఇంజినీరింగ్‌ కింద అమెనిటీస్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2); టౌన్‌ ప్లానింగ్‌ కింద ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2); వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ క్లాస్‌ కింద వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీ (గ్రేడ్‌-2) కేటగిరీల కార్యదర్శులను ఉంచారు.
  • ఏదన్నా కేటగిరీలో కనీసం మూడేళ్లు పని చేసిన వారు పదోన్నతులకు అర్హులవుతారు. అయితే ఆయా పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, ఇతర క్వాలిఫికేషన్లు కలిగి ఉండాలి. అంతేకాకుండా నిర్ణీత ప్రమోషన్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులవ్వాలి. ఒకవేళ ఏవైనా పోస్టులను భర్తీ చేయడం ప్రజావసరాల రీత్యా అవసరమైనప్పుడు వాటికి ఎవరినన్నా తాత్కాలిక ప్రాతిపదికన ఉన్నతాధికారులు ప్రమోట్‌ చేస్తారు. అయితే నిర్ణీత అర్హతలున్న వారు ఆ పోస్టుల్లో నియమితులయ్యేంత వరకే వారు ఆ స్థానాల్లో కొనసాగుతారు.
  • వార్డు కార్యదర్శులకు సెలవులు, రుణాలు, అడ్వాన్సులు ఇచ్చే అధికారం మున్సిపల్‌ కమిషనర్లదే.
  • వార్డు కార్యదర్శులపై విధి నిర్వహణకు సంబంధించి ఏవైనా ఆరోపణలు వచ్చినట్లయితే వాటి తీవ్రతను బట్టి సదరు ఉద్యోగులపై విచారణ జరిపించేందుకు, సస్పెండ్‌ చేసేందుకు, చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేయించేందుకు, ఇంక్రిమెంట్‌ ఆపేందుకు, వేతనాన్ని మినహాయించుకునేందుకు సంబంధిత కమిషనర్లకు అధికారం ఉంటుంది.
  • వీరు తీసుకున్న చర్యలపై కాంపిటెంట్‌ అథారిటీకి అప్పీల్‌ చేసుకునేందుకు నెల రోజులు, వారి స్పందనపైనా అసంతృప్తి ఉంటే సంబంధిత శాఖాధిపతికి 3 నెలల్లోగా వార్డు కార్యదర్శులు అప్పీల్‌ చేసుకోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :