Wednesday, November 27, 2019

Ap cabineit decisions



Read also:

  • ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
  • వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.1101కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయం. 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు కేబినెట్‌ ఆమోదం.
  • నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.
  • కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం.
  • జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు.
  • ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
  • తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు.
  • సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :