Friday, November 1, 2019

Amma vodi Rules



Read also:

వీరికి మాత్రమే అమ్మఒడి.రూల్స్ తెలుసుకోండి 

కొత్త రూల్స్ ప్రకారం.ఒకటవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పధకం వర్తింపచేశారు. ఈ పథకం అందుకోవాలంటే. పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఒకవేళ పేదరికం పరంగా అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తు అర్జీ ఉంటే లబ్దిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.జనవరి లో బ్యాంకు ఖాతాలకు ఈ నిధుల జమ అయ్యేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి అమ్మఒడి పథకం వర్తించదని గతంలో ప్రచారం జరిగిందికానీ అది నిజం కాదు.

Guidelines

  1. పిల్లలు ఏ స్కూల్ లో చదువుతున్నారన్నది విషయం కాదు.వారికి తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా అన్నదే అర్హతను నిర్ణయిస్తుంది. తాజా కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకానికి 6450 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదాన్ని తెలియ చేసింది.
  2. నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే. 
  3. ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు. 
  4. ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. 
  5. ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
  6. ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
  7. అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోయినా.. కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
  8. జనవరిలో బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.
  9. అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి. 
  10. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి.
  11. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.
  12. అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. 
  13. అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్‌ను సంప్రదించాలి. 
  14. అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు.
  15. అమ్మఒడి పథకం వర్తించాలంటే ఒకటో తరగతి నుంచి ఇంటరు వరకు చదువుతున్న విద్యార్థులకు డిసెంబరు 31 నాటికి 75 శాతం హాజరుండాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు హాజరు నివేదికలను తయారు చేయాలని సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :