Friday, November 15, 2019

Aadhar update status



Read also:


Aadhaar అప్‌డేట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా క్షణాల్లో చెక్ చేసుకోండి

ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకున్నారా?అయితే ఆన్‌లైన్‌లోనే స్టేటస్ తెలుసుకోవచ్చుదీని కోసం ఎక్కువ టైమ్ కూడా పట్టదుసులభంగానే పని పూర్తి చేసుకోవచ్చు
యూఐడీఏఐ ఎన్నో రకాల ఆన్‌లైన్ సేవలు అందిస్తోంది. ఆధార్ అప్‌డేట్, స్టేటస్ చెక్ వంటి పలు సర్వీసులను ఆన్‌లైన్2లో పొందొచ్చు. యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి ఈ పని పూర్తిచేయవచ్చు.

ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా 1947 నెంబర్‌కు కాల్ చేసి కూడా ఇ-ఆధార్ జనరేట్ అయ్యిందా? లేదా? అని తెలుసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ తర్వాత యూఆర్ఎన్ నెంబర్ సాయంతో ఆధార్ కార్డు అడ్రస్ అప్‌డేట్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు.
AadharUpdateStatus

ఆధార్ స్టేటస్ ఇలా తెలుసుకోండి.

యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మై ఆధార్ ట్యాబ్‌లో గెట్ ఆధార్ కింద చెక్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, క్యాప్చా ఎంటర్‌ చేసి స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ అయ్యి ఉంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా అప్‌డేట్ సెంటర్‌లో అప్‌డేట్ చేసుకొని ఉంటే ఈ విధానం వర్తిస్తుంది.
అదే ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని స్టేటస్ తెలుసుకోవాలని భావిస్తే.. దీనికి కూడా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మై ఆధార్ ట్యాబ్ కింద అప్‌డేట్ యువర్ ఆధార్ కింద చెక్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (యూఆర్ఎన్) కూడా అవసరం అవుతుంది.
ఇకపోతే ఆధార్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పేరు, అడ్రస్, జెండర్ వంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే ఇప్పుడు రూ.50 చెల్లించాలి. ఇది వరకు వీటి అప్‌డేట్‌కు రూ.25 వసూలు చేసేవారు. అంటే ఇప్పుడు చార్జీలు డబుల్ అయ్యాయి. ఆధార్ కార్డులో ఫోటో లేదా ఫింగర్‌ప్రింట్స్ అప్‌డేట్‌కు కూడా రూ.50 చెల్లాంచాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :