Monday, November 11, 2019

Aadhar card update new rules



Read also:

Aadhar Rules - ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్నారా? పేరు, పుట్టిన తేదీ తదితర అంశాలు.కొత్త రూల్స్ చూడండి.

ఆధార్‌ అప్‌డేట్‌:  కొత్త రూల్స్‌

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్నారా? పేరు, పుట్టిన తేదీ తదితర అంశాలు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు. ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకొచ్చింది. కొత్త నిబంధనల ప్రకారంఇకపై ఆధార్‌లో పుట్టినతేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలుంటుంది.
ఆధార్‌ కార్డు జారీ చేసిన సమయంలో పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్‌ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.

కొత్త నిబంధనలు ఇవే

  • ఆధార్‌ కార్డుపై మీ పేరులో తప్పులుంటే ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.
  • పుట్టిన తేదీ, లింగం విషయంలో తగిన ఆధారాలతో కేవలం ఒక్కసారే మార్చుకోవాలి.
  • ఆధార్‌ కార్డులో ప్రస్తుతం ఉన్న పుట్టినతేదీకి మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే.
  • నిర్దేశించిన సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులకు సంబంధించిన ధ్రువపత్రాలను ఇ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది.
  • ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :