Sunday, November 17, 2019

There is no negligence on the implementation of the PRC



Read also:

పీఆర్‌సీ నివేదిక రాగానే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే అమలు పరచాలని టీఎస్‌యూటీఎఫ్‌ శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్‌ కోరారు. నల్లబెల్లిలో శుక్రవారం నిర్వహించిన మండల శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌ టైమ్‌ స్వీపర్లకు సర్వీసు ధ్రువీకరణ పత్రాలందించే ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌ చేయాలనే పాఠశాల విద్య కమిషన్‌ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్వీపర్లకు నామమాత్రపు వేతనాలు చెల్లిస్తున్నారని, వారు పనిచేసిన కాలానికి ధ్రువీకరణ పత్రం ఇవ్వడం ప్రధానోపాధ్యాయుల కనీస బాధ్యతని ఆయన గుర్తు చేశారు.సమావేశంలో శాఖ జిల్లా అధ్యక్షుడు పెండెం రాజు, ప్రధాన కార్యదర్శి రఘుపతిరెడ్డి, నవీన్‌కుమార్‌, రాజయ్య, రవూఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :