Friday, November 1, 2019

Gas Cylinder rate increased



Read also:

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

మధ్యతరగతి ప్రజలకు ఒకటో తేదీ షాక్ తగిలింది. వంట గ్యాస్ ధర బాగా పెరగడం జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెరుగుదల ఈ రోజు నుంచి అమలులోకి వస్తుంది అని తెలిపారు. సిలిండర్ ధర ఏకంగా రూ.76 మేర పెరిగింది. దీంతో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారిపై ప్రతికూల ప్రభావం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ఇండియన్ ఆయిల్ లేటెస్ట్ ధరల జాబితా ప్రకారం.. ఇండేన్ గ్యాస్ 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.681.50గా ఉంది. ఢిల్లీలో ఈ ధర నడుస్తుంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర కోల్‌కతాలో రూ.706గా, ముంబైలో రూ.651గా, చెన్నైలో రూ.696గా మార్కెట్లో అమ్మకాలు ఉన్నాయి.ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తారీఖున మారుతూ వస్తుంది అని సంగతి అందరికి తెలిసిందే.

సిలిండర్ ధర పెరగొచ్చు.. లేదంటే తగ్గొచ్చు. సిలిండర్ ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా మూడో నెల అవ్వడం జరిగింది. అక్టోబర్ నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.15 మేర పెరిగింది. సెప్టెంబర్ నెలలోనూ ఎల్‌పీజీ ధర రూ.15.5 పైకి పెరగడం జరిగింది. అయితే గతేడాది ఇదే నెలలోని గ్యాస్ సిలిండర్ ధరతో పోలిస్తే ఇప్పుడు ధర ఏకంగా రూ.250 దిగువున ఉందని చెప్పుకోవచ్చు. గతేడాది నవంబర్ నెలలో ఢిల్లీలో గ్యా్స్ సిలిండర్ ధర ఏకంగా రూ.939గా ఉంది. ఇకపోతే గతంలో జూలై, ఆగస్ట్ నెలల్లో నాన్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర మొత్తంగా రూ.163 భారీగా తగ్గిన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. వీటిని అదనంగా సిలిండర్ కావాలంటే మార్కెట్ ధర చెల్లించాలి. ఇకపోతే గ్యాస్ కంపెనీలు ప్రతి నెలా ఎల్‌పీజీ సిలిండర్ రేట్లను చూస్తూ ఉంటారు. సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్‌పీజీ రేట్లు, అమెరికా డాలర్-ఇండియన్ రూపాయి మారకపు విలువ వంటి అంశాలు ప్రాతిపదికన ధరలో మార్పులు ఉంటాయి అని తెలుస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :