Sunday, November 17, 2019

Aadhar link for your properties



Read also:

షాకింగ్.ఆస్తులకు ఆధార్‌ లింక్‌

ఆయాబాబోయ్.ఆస్తులకు ఆధార్ లింక్ అంట.ఇంకేమైనా ఉందా ? బినామాల సంగతి ఏంటో మరి.చుక్కలు కనిపించేలా ఉందిగా? నల్లధనాన్ని, హవాలా లావాదేవీలను, బినామీ ఆస్తుల లావాదేవీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది.
ఈ విషయంపై గత రెండు మూడు సంవత్సరాల నుండి ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలు కాస్త అతి త్వరలో వాస్తవరూపం దాల్చవచ్చని ఆ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో స్థిరాస్తుల కొనుగోలు, అమ్మకాలను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తుందని, ఆ ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించాయి.
ప్రభుత్వ నిర్ణయం వాస్తవరూపం దాలిస్తే దేశంలో బినామీలు బట్టబయలవుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.స్థిరాస్తి లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని, అంతేకాకుండా భూములు, ఇళ్ల ధరలు తగ్గవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమలు లోకి వస్తే చాలామంది వారి అక్రమాస్తులు వదిలించుకోడానికి సిద్దపడుతారని అందుకే తగ్గుతాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
ఆధార్‌తో ఆస్తులను అనుసంధానం చేస్తే నల్లధనం బయటకు వస్తుందని, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మోసాలు భారీగా తగ్గుతాయని, మహారాష్ట్రలోని నారెడ్‌కో సంస్థ అధ్యక్షుడు రాజన్‌ బందేల్కర్‌ పేర్కొన్నారు. ఆస్తులతో ఆధార్ లింక్ అవుతే ఒక్క బినామీలు ఏంటి అందరూ బయట పాడుతారు.
ముఖ్యంగా అమలు చేసే రాజకీయనాయకులే బయట పడుతారు. ఎందుకంటే ఎక్కువగా రాజకీయనాయకులు, పారిశ్రామకవేత్తలే బినామీలను పెడుతుంటారు. ఒకవేళ ఈ ఆధార్ తో ఆస్తుల లింక్ అమలయితే భారత్ లో ప్రతి రాజకీయ నాయకుడికి చుక్కలు కనిపిస్తాయి అని చివరికి అమలు చేసిన వారికీ కూడా కనిపిస్తాయిని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ ఆధార్ ఆస్తులతో ఎప్పుడు లింక్ అవుతుందో చూడాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :