Sunday, November 17, 2019

AP Sarkar's key decision on welfare schemes



Read also:

సంక్షేమ పథకాలపై ఏపి సర్కార్ కీలక నిర్ణయం

బడుగు బలహీనవర్గాలు ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకానికైనా ఇప్పటివరకు రేషన్ కార్డును మాత్రమే ప్రాతిపదికగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఏపీ సర్కార్ ఆ మాటను తిరగరాయనుంది. ఇకనుండి రేషన్ కార్డు కేవలం రేషన్ పొందడానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రభుత్వ పథకాలను పొందడానికి రేషన్ కార్డు ఏమాత్రం పనికిరాదు. కాగా ప్రభుత్వ పథకాలను పొందడం కోసం ఏపి ప్రభుత్వం మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆయా పథకాలకు సంబంధించిన ప్రజల అర్హతను బట్టి కార్డులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. పాత రేషన్ కార్డు మాత్రం రద్దు చేయకుండా ప్రభుత్వ పథకాల కోసం మాత్రం ప్రత్యేకంగా కొత్త కార్డులను కేటాయిస్తారు.వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్డును ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.

నాలుగు కొత్త కార్డులు ఇవే:

ఇప్పటి నుంచి ఏ శాఖకు సంబంధించి.ఆ కార్డును లబ్ధిదారులు ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే.రేషన్‌ షాపులో బియ్యం కార్డు, ఉచిత వైద్య సేవల కోసం ఆరోగ్యశ్రీ కార్డు, చదువు విషయంలో ఫీజు రియంబర్స్‌మెంట్ కార్డు, పింఛన్ పొందే వారి కోసం పింఛన్ కార్డులను ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది.ఈ కార్డులను.. ఈ నెల 20వ తేదీ నుంచే గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.ఎంపికైన అర్హులకు జారీ చేస్తారు. అయితే. పాత రేషన్ కార్డు మాత్రం రద్దు కాదు.. దాన్ని ఎలా ఉపయోగించాలన్నది ప్రభుత్వం యోచిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :