Friday, October 18, 2019

YSR kishora scheme for girls saftey



Read also:

ఆడపిల్లలకు, మహిళలకు భద్రత చేకూరుస్తూ వైఎస్సార్‌ కిశోర పథకం.ప్రారంభం

మన రాష్ట్రంలోని ఆడపిల్లలు మరియు మహిళలకు ఎప్పుడు పూర్తి రక్షణ,స్వేచ్ఛ ఉండాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతోనే,ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు ఆకాంక్షించేవారు.దానికి అనుగుణంగానే 'వైఎస్సార్‌ కిశోర పథకం' అనే పేరుతో రూపొందించి, లాంఛనంగా ప్రారంభించారు .ఈ పథకాన్ని హోంమంత్రి అయిన మేకతోటి సుచరిత మరియు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన తానేటి వనిత గురువారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.

పథకం లాంచ్ అనంతరం, హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనేదే సీఎం జగన్ ఎప్పుడు ఆకాంక్షించేవారని, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమని కూడా వ్యాఖ్యానించారు. ఏపీలో మహిళలకు 50 శాతం అవకాశాలు ఇస్తున్న వ్యక్తి ఒక్క సీఎం జగన్ అని చెప్పారు.పలు సైబర్ నేరాలు అరికటేందుకు ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తోందని తెలిపారు

స్మార్ట్ ఫోన్‌లు అనర్ధాలకు కూడా దారి తీస్తున్నాయని ఒత్తిడితో సహా స్మార్ట్ ఫోన్‌ వల్ల అనేక సమస్యలను యువత కొని తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు.

మహిళల కోసం,మద్యపాన నిషేధంపై సీఎం జగన్ అడుగులేస్తున్నారు.మద్యంపై వచ్చే ఆదాయం కోసం ఆలోచించకుండా,కేవలం మహిళల కోసం సీఎం జగన్ మద్య నిషేధం వైపు చర్యలు చేపట్టనున్నారు అని మంత్రి వనిత పేర్కొన్నారు.ప్రతి వ్యక్తి తన జీవితంలో బాల్యంలో తమ తల్లిదండ్రులు చెప్పినట్లుగా విని చరించాలని, అలాగే యవ్వనంలో తల్లిదండ్రులను మాయ చేయకుండా వాళ్ళను సంప్రదించి,నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పారు.

యవ్వనంలో వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని,ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేకపోవటం వలన మన వ్యవస్థపై నష్టం పడుతుంది అని తన అభిప్రాయం పంచుకున్నారు.ఇప్పటి పరిస్థితుల వల్ల సొసైటీలో గుడ్ టచ్,బ్యాడ్ టచ్‌లను గుర్తించి, ఎటువంటి ఇబ్బంది ఎదురు పడిన వెంటనే, , తమ పెద్దలకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ అయిన వాసిరెడ్డి పద్మ కూడా పాల్గొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :