Tuesday, October 22, 2019

What is google play pass and how it works



Read also:

గూగుల్‌ ప్లే పాస్‌ ఎలా పనిచేస్తుంది? ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?

google-play-pass

What is google play pass and how it works 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే పెయిడ్‌ అప్లికేషన్స్‌, గేమ్స్‌ విడివిడిగా కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా నెలకు కొంత సబ్‌స్ర్కిప్షన్‌ రుసుము తీసుకోవడం ద్వారా ప్రముఖ పెయిడ్‌ యాప్స్‌ని, గేమ్స్‌ని నెల రోజుల పాటు ఉచితంగా వినియోగించుకునే విధంగా వినియోగదారులకు అవకాశం కల్పించడం కోసం గూగుల్‌ సంస్థ ఇటీవల తీసుకొచ్చిన సర్వీస్‌ ‘గూగుల్‌ ప్లే పాస్‌’. ప్రస్తుతం ఇది యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం దీని ధర దాదాపు 353 రూపాయలు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి.కొన్ని ఎంపిక చేయబడిన అప్లికేషన్స్‌, గేమ్స్‌ మాత్రమే ఈ గూగుల్‌ ప్లే పాస్‌ ద్వారా నెల రోజుల పాటు ఉచితంగా వాడుకోవడానికి లభిస్తాయి. అంతే తప్ప అన్ని పెయిడ్‌ అప్లికేషన్స్‌, గేమ్స్‌ ఈ విధానం ద్వారా లభించవు. ఒకవేళ భవిష్యత్తులో అప్లికేషన్‌ డెవలపర్లకు గూగుల్‌ సంస్థకు మధ్య ఒప్పందం కుదిరితే మరికొన్ని అప్లికేషన్స్‌ ఈ పాస్‌ ద్వారా లభించే అవకాశం ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :