Thursday, October 17, 2019

SBI introduced cardless transactions



Read also:

SBI introduced cardless transactions

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ అనుబంధ ఎస్‌బీఐ కార్డ్ తన ఖాతాదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. చెల్లింపుల సమయంలో కార్డు మర్చిపోయాననో, పిన్‌ గుర్తుకు రావడం లేదనో బాధపడే వారికి ఇది శుభవార్త. ఇకపై కార్డు, పిన్‌తో పనిలేకుండా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా 'ఎస్‌బీఐ కార్డ్ పే' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే చేయాల్సిందల్లా ఒక్కటే. ఎస్‌బీఐ కార్డ్ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకుంటే చాలు. ఆ తర్వాత షాపింగ్‌ మాల్‌, పెట్రోల్‌ బంక్‌...ఇలా ఎక్కడికి వెళ్లినా డబ్బు చెల్లించాల్సి వస్తే అక్కడి 'పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టర్మినల్‌' వద్ద మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా డబ్బు జమ చేయవచ్చు.
SBI-Cardless-Transactions
అయితే ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ కిట్‌ క్యాట్‌ వెర్షన్‌ 4.4, అంతకు మించి ఓఎస్‌ ఉన్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లతో మాత్రమే పొందే వీలుంటుంది. ఒక్కో లావాదేవీలో, రోజు వారీ లావాదేవీలో ఎంత ఖర్చు చేయాలన్న విషయం ఖాతాదారుడే నిర్ణయించుకోవచ్చని, ఈ విధానం కోసం పూర్తి సురక్షితమైన హోస్ట్‌కార్డ్ఎమ్యూలేషన్‌ సాంకేతికత(హెచ్‌సీఈ)ను ఉపయోగించినట్టు ఎస్‌బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ హర్‌దయాళ్‌ ప్రసాద్‌ తెలిపారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :