Wednesday, October 23, 2019

SBI Branch transfer on online



Read also:

SBI-ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్ మార్చుకునే సేవలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రా, ఏటీఎం, చెక్ బుక్, డీడీ, నెట్‌ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఇలా పలు సర్వీసులు ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ అకౌంట్‌ను ఒక బ్రాంచు నుంచి మరో బ్రాంచుకు మార్చుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది.అకౌంట్ బదిలీ చేసుకోవాలంటే గతంలో అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫామ్‌ను ఫిల్ చేయడం, ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారో తెలియజేడం, ఐడీ ప్రూఫ్ వంటివి అవసరం అయ్యేవి. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభంగానే అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ అకౌంట్‌ను ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచ్‌కు ఎలా మార్చుకోవాలో చూద్దాం.
SBI branch online transfer
✺స్టేట్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.onlinesbi.com/ కు వెళ్లండి.
✺ పర్సనల్ బ్యాంకింగ్ ఎంచుకోండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వండి.
✺ ఇప్పుడు టాప్ మెనూ బార్‌లోని ఇ-సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
✺ మీకు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్స్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలని భావించే అకౌంట్‌ను ఎంచుకోవాలి. మీకు ఒక అకౌంట్ ఉంటే అదే డిఫాల్ట్‌గా సెలెక్ట్ అవుతుంది.
✺ ఇప్పుడు మీరు అకౌంట్‌ను ఎక్కడికైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి.సబ్‌మిట్ చేయాలి.
✺ మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ వివరాలను మరోసారి చెక్ చేసుకోవాలి. ఓకే అనుకుంటే కన్ఫర్మ్‌పై క్లిక్ చేయాలి.
✺ ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి ఓకే చేయాలి.
✺ మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇందులో మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయ్యిందని ఉంటుంది.
✺ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉండి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :