Friday, October 18, 2019

Reprint your PAN card with50rupees



Read also:

ఆన్‌లైన్‌లో రీప్రింట్‌కు రూ.50 చెల్లిస్తే చాలు

Reprint PAN Card | పాన్ కార్డు డ్యామేజీ కావడం లేదా ఎక్కడైనా పోగొట్టుకోవడం అందరికీ అనుభవమే. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి ? అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి ? అన్న సందేహాలు అందరిలో ఉండేవే.

PAN card: పాన్ కార్డు పోయిందా ?  ఆన్‌లైన్‌లో రీప్రింట్‌కు రూ.50 చెల్లిస్తే చాలు

మీ పాన్ కార్డు పోయిందా? మీ పాన్ కార్డును రీప్రింట్ చేయించాలనుకుంటున్నారా ?
కొత్త కార్డు ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదా ? టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇలాంటి పనులన్నీ చాలా ఈజీ. మీరు మీ పాన్ కార్డును ఆన్‌లైన్‌లో రీప్రింట్‌కు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.
పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఒకరు ఒకసారి పాన్ కార్డు తీసుకున్నారంటే ఆ నెంబర్ వారికే పరిమితం. ఇక మరో నెంబర్‌తో పాన్ కార్డు తీసుకోవడం చట్టవిరుద్ధం.
 ఆదాయపు పన్ను శాఖ UTITSL లేదా NSDL-TIN ద్వారా పాన్ కార్డుల్ని జారీ చేస్తుంటుంది. తరచూ ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి పాన్ కార్డు చాలా అవసరమైన డాక్యుమెంట్. కొన్ని లావాదేవీలు పాన్ కార్డు లేకుండా జరగవు. కొన్ని సందర్భాల్లో పాన్ కార్డు డ్యామేజీ కావడం లేదా ఎక్కడైనా పోగొట్టుకోవడం అందరికీ అనుభవమే. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? అదే నెంబర్‌తో కొత్త పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి ? అన్న సందేహాలు అందరిలో ఉండేవే. కొత్త పాన్ కార్డ్ తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో సులువే. రీప్రింట్ చేసే విధానాన్ని సులభతరం చేసింది ఆదాయపు పన్ను శాఖ.

PAN card: పాన్ కార్డ్ ఆన్‌లైన్‌లో రీప్రింట్‌ చేయించండి ఇలా

మీరు https://www.tin-nsdl.com లేదా https://www.utiitsl.com వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
Reprint PAN Card ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
మీ పాన్ కార్డు వివరాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి.
చివరగా రూ.50 చెల్లిస్తే మీకు పాన్ కార్డ్ జారీ అవుతుంది.
మీ పాన్ కార్డు విదేశాలకు పోస్ట్ ద్వారా పొందాలంటే రూ.959 చెల్లించాలి.
పాన్ కార్డ్ రీప్రింట్ చేయించే ముందు మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఓసారి చెక్ చేసుకోవాలి.
Reprint your PAN 
Download your PAN

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :