Monday, October 21, 2019

How to transfer PF Account



Read also:

పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఇంత సింపులా ! పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండిలా 

ఒక ఉద్యోగం వదిలి , మరో ఆఫీసులో జాయిన్ కావాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రావిడెంట్ ఫండ్ ( పీఎఫ్ ) గురించే . పాత కంపెనీ నుంచి కొత్త ఎంప్లాయర్ కు ఖాతాను ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమవుతుంటారు . కింది సూచనలు పాటిస్తే మీ పని సులువు అవుతుంది .
1).యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ( యూఏఎన్ ) పాస్ వర్డులో ఈబీఎఫ్ మెంబర్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది . యూఏఎన్ నెంబర్ ఉద్కోగి నెలవారి పే స్లిప్ పై ఉంటుంది .
2).ఆ తర్వాత హోం పేజీలోని మెయిన్ మెనూలో ఉన్న ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ లోకి వెళ్లాలి . ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ ను పేటుకోవడానికి టాన్ ఫర్ రిక్వెస్టు ట్యాబ్ క్లిక్ చేయాలి.
3).ట్రాన్స్ఫర్ రిక్వెస్టు క్లిక్ చేసిన తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది . అక్కడ ఉద్యోగికి సంబంధించిన అన్ని వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి .
4).ఈపీఎఫ్ నెంబర్ , పుట్టిన తేది , జాయినింగ్ తేది , వంటి అన్ని వ్యక్తిగత వివరాలను యూజర్ వెరిఫై చేసుకోవాలి .
5).తర్వాత ట్రాన్సఫర్ చేసుకోవాల్సిన అంతకు ముందు అకౌంట్ ఆప్పనను ఎంపిక చేసుకోవాలి . ఆ తర్వాత సబ్ మిట్ చేయాలి . 
6).రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది . ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ సబ్ మిట్ అవుతుంది . ఒక ఫామ్ కూడా జనరేట్ అవుతుంది .దానిపై సంతకం పెట్టి పాత ఎంప్లాయర్ కు పంపాలి . 
7).ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ గురించి ఎంప్లాయర్ కు కూడా ఆన్లైన్ నోటిఫికేషన్ వెళ్తుంది . ఉద్యోగి వివరాలు వెరిఫై , అయిన తర్వాత పాత కంపెనీ కూడా ఈపీఎఫ్ఓ ఆఫీస్ కు ఈ క్లెయిమ్ ను డిజిటల్ గా ట్రాన్స్ఫర్ చేయవచ్చు . 
8).ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మొనూ ద్వారా ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ ను కూడా మనం చెక్ చేసుకోవచ్చు .
9).ఈపీఎఫ్ఓ ఆన్లైన్లో మెంబర్లు పీఎఫ్ పైనల్ సెటిల్ మెంట్ , పెన్షన్ , పీఎఫ్ విత్ డ్రాయల్ వంటి పనులు చేసుకోవచ్చు.
PF claim step by step

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :