Wednesday, October 23, 2019

Google pixel4 phone



Read also:

అత్యాధునిక ఫీచర్లతో పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లు
మంగళవారం న్యూయార్క్ లో లాంచింగ్ వేడుక
ఐ ఫోన్ 11 కంటే మించిన ధర
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా పిక్సెల్ 4 సిరీస్ లో భాగంగా పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ను లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. మంగళవారం న్యూయార్క్ లో దీనికోసం భారీ హార్డ్ వేర్  ఈవెంట్ ను నిర్వహించనుంది. పిక్సెల్ 4 కు సంబంధించి ఫీచర్లను గూగుల్ కొన్నింటిని బహిర్గత పర్చగా.. మరికొన్ని వివరాలు అనధికారికంగా వెల్లడయ్యాయి. 
google-pixel4
ఈ మొబైల్స్ ధరలు ఇంకా ప్రకటించలేదు. ఐ ఫోన్ 11 కంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది. పిక్సెల్ 4 సిరీస్ లో మరొక వేరియంట్ ‘ ఆరెంజ్’ ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ లో 'సోలి' అనే మోషన్ సెన్సింగ్ రాడార్  ఫీచర్ ఉంది. దీనిపై గూగుల్ ఇప్పటికే వీడియోను కూడా విడుదల చేసింది.  సైగల ద్వారా ఫోన్ ను నియంత్రించడం ఈ ఫోన్ ప్రత్యేకత.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :