Thursday, October 31, 2019

Google pay invented new update for secure transactions



Read also:

స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ మంది డిజిటల్ లావాదేవీల కొరకు వినియోగించే గూగుల్ పే యాప్ ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సాధారణంగా గూగుల్ పే కస్టమర్లు లావాదేవీలు చేయటానికి మొదట పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పిన్ స్థానంలో గూగుల్ పే బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే లేటెస్ట్ వర్షన్ 2.100 లో అందుబాటులోకి తెచ్చింది.

Google pay invented new update for secure transactions-Finger print option

గూగుల్ ఆండ్రాయిడ్ 10తో ఈ ఫీచర్ ను ప్రకటించింది. ఆన్ లైన్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ ప్లాట్ ఫాంలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ పే వినియోగదారులు యాప్ అప్ డేట్ చేసుకోవటం ద్వారా బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ ఉపయోగించి లావాదేవీలను జరుపుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పే యాప్ లో సెండింగ్ మనీ అనే సెక్షన్ కింద కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ 10 మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ మరికొన్ని రోజుల్లో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 ఫోన్లలో కూడా అందుబాటులోకి రానుంది. గూగుల్ పే వినియోగదారులకు యాప్ సెక్యూరిటీని పెంచటం కొరకు గూగుల్ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ పే వినియోగదారులు పిన్ సెక్యూరిటీ ఫీచర్ నుండి బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ కు సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. పిన్ మరియు బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ నగదు లావాదేవీలకు మాత్రమే పని చేస్తుందని స్టోర్లలో లావాదేవీలకు పని చేయదని తెలుస్తోంది. సాధారణంగా కొందరు గూగుల్ పే పిన్ మరిచిపోయే అవకాశం ఉంది కానీ బయోమెట్రిక్ సెక్యూరిటీ ఫీచర్ ద్వారా ఎటువంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ పే యాప్ కు 6 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :