Friday, November 1, 2019

good news for who are taking the home loan



Read also:

నగరంలో జీవించే వారిలో అందరికి స్వంత ఇల్లు ఉండాలని ఏం లేదు. ఎందుకంటే చాలి చాలని ఆదాయంతో బ్రతుకీడ్చే మధ్యతరగతి వారికి స్వంత ఇల్లు ఓ కలగానే మిగులుతుంది. అద్దె యింట్లో ఉంటూ నానా అవస్దలు పడుతూ తమకు ఓ స్వంత ఇల్లు లేదని బాధపడని రోజు ఉండదు. ఇలాంటి వారికోసం, వీరి స్వంత ఇల్లు కలను సాకారం చేసుకోవాలనే ప్రయత్నానికి కేంద్రం నుండి తీపి కబురు అందబోతుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఇంటి కొనుగోలుదారులకు శుభవార్త అందించేందుకు సర్వం సిద్దం చేస్తుంది.ఇక వీరికి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాన్ని, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను కూడా ఆదుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చూస్తోంది. జీ బిజినెస్ టీవీ నివేదిక ప్రకారం.రియల్టీ రంగానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వాలని కూడ ఆలోచనలో ఉందట.. ఈ దశలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కొత్త ఏడాదిలో వెలువడొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల అంశమని చెప్పొచ్చు అంటున్నారు ఆర్ధిక నిపుణులు.
ఇకపోతే కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మందిపై ఈ ప్రభావం ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తే వారికి ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే.ట్యాక్స్ రిబేట్ వస్తుంది. దీంతో వారికి రూ.50,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదీ కాకుండా మీరు హోమ్ లోన్‌ రూపంలో ఏడాదిలో రూ.5 లక్షల వరకు వడ్డీ చెల్లిస్తూ ఉంటే మీరు చెల్లించే పన్నులో దాదాపు రూ.50,000 లేదా 10 శాతం ఆదా కలుగుతుంది' అని జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ తెలిపారు. ఇకపోతే కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే వారికి తీసుకున్న లోన్‌పై తొలి మూడు సంవత్సరాలపాటు ట్యాక్స్ రిబేట్ లభించొచ్చు. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై సానుకూల ప్రభావం పడే అవకాశముంది. ఇక ఈ కొత్త నిర్ణయం 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావొచ్చని అంచనా వేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :