Wednesday, October 9, 2019

Dr YSR Kanti velugu program



Read also:

Guidelines for teachers

డా వై ఎస్ ఆర్ కంటి వెలుగు కార్యక్రమం

  • వై.ఎస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి ఉపాధ్యాయులకు సూచనలు ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.
  • ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులకు  కంటి తనిఖీ లను నిర్వహిస్తారు.
  • దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.

వీటి వినియోగం ఇలా

  • మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.
  • విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.
  • విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని శుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.
  • విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.
  • ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.

ప్రదర్శన

  • పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు *E* అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నయిననే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.
  • పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.

పరీక్షించే విధానం

మొదటి లైన్ పెద్ద   "E" 
పాస్.
కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి
ఫెయిల్
ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చుపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.

రెండవ లైన్. చిన్న  --  E
పాస్
కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.
ఫెయిల్
మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి.
ముందు కుడి కన్ను తరువాత యెడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి

గమనిక

విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా ముసుకోమని చెప్పాలి.

సంపూర్ణ కంటి పరీక్షా

  • కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లాయిన
  • టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్తితి గమనించినా
  • ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.
  • వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి.

గమనించండి.

ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.

వైఎస్సార్ కంటి వెలుగు

  • వైఎస్సార్ కంటి వెలుగు తొలిదశ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు
  • రెండో దశ నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు
  • 3వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు
  • 4వ దశ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 2021 సంవత్సరం జనవరి 31 వరకు
  • 5వ దశ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు
  • 6వ దశ కార్యక్రమం 2021 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 2022 సంవత్సరం జనవరి 31 వరకు.
Download the guidelines for screening test

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :