Monday, October 21, 2019

Diwali offer on vivo phones



Read also:


దీపావళి ఆఫర్: రూ.101 చెల్లిస్తే స్మార్ట్ ఫోన్, ఏ ఫోన్లపై అంటే.
దీపావళి పండుగ సందర్భంగా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కస్టమర్లకు సూపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.101 డౌన్ పేమెంట్‌తో కొత్త ఫోన్‌ను ఈఎంఐలో కొనుగోలు చేసుకునే వెసులుబాటును కల్పించింది. కేవలం ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31వ తేదీ వరకు అందిస్తున్నారు. అన్ని సంస్థల్లాగే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ వంటి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తూ రూ.101కే ఫోన్ అంటూ అదనపు ప్రయోజనం కల్పిస్తోంది.

ఇతర ప్రయోజనాలు.

రూ.101 డౌన్ పేమెంట్‌కే వివో ఫోన్ అందించడంతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తోంది.నో కాస్ట్ ఈఎంఐ, జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, హోమ్ క్రెడిట్, ఐడీఎఫ్‌సీఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హెచ్‌డీబీఎఫ్‌ఎస్ ద్వారా జీరో డౌన్ పేమెంట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 12 నెలల ఈఎంఐ అందుబాటులో ఉంది.

ఈ కార్డులతో క్యాష్ బ్యాంక్, నెలకు రూ.926


HDB ఫైనాన్స్‌తో వివో ఫోన్లను కొంటే పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. HDFC, ICICI క్రెడిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఉంది. రూ.101 డౌన్ పేమెంట్‌తో నెలకు రూ.926 ఈఎంఐతో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అలాగే పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేస్తే రూ.1,999 విలువైన బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌ను పొందవచ్చు. వివో వీ 17 ప్రో, ఎస్ 1 ఫోన్లపై కొనుగోలుతో ఇవి అదనం.

ఈ ఫోన్లపై ఆఫర్లు.

అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ మధ్య ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లు Vivo V17 Pro, Vivo V15 Pro, Vivo Z1x 8GB RAM variant, Vivo V15, Vivo S1, Vivo Y17, Vivo Y15, Vivo Y12 ఫోన్లపై వర్తిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :