Sunday, October 20, 2019

Be alert



Read also:

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండ్రోజులు భారీ వర్షాలు

ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది అక్టోబర్ 20న మరింత బలపడే అవకాశాలున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది.
ఈ కారణంగా శనివారం కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. అలాగే అక్టోబర్ 21, 22 తేదీల్లో కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంటుందని ఐఎండీ తెలిపింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :