Sunday, October 20, 2019

Bank employees strike on 22nd



Read also:

బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా (అక్టోబర్ 22, 2019) దేశ వ్యాప్తంగా సమ్మె చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు. సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడనుంది. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపి 4 బ్యాంకులుగా మార్చాలనే మోడీ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె బాట పడుతున్నట్లు బ్యాంక్ యూనియన్లు చెబుతున్నాయి. ఈ సమ్మెలో ఏకంగా 2 లక్షలకు పైగా బ్యాంక్ ఉద్యోగులు పాల్గొనవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందనే విషయాన్ని తాము అర్థం చేసుకోగలమని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ) తెలిపింది
అందుకే సమ్మెకు దిగుతున్నామని పేర్కొంది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కూడా సమ్మెకు మద్దతు తెలిపింది.బ్యాంకుల విలీనం వల్ల పెద్ద సంఖ్యలో బ్రాంచులు మూతపడతాయని తెలిపింది. దీంతో స్టాఫ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందని, అప్పుడు ఉద్యోగాల కోత ప్రారంభమౌతుందని బీఈఎఫ్ఐ తెలిపింది. మొండి బకాయిలను వసూలు చేయడం, డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం, కస్టమర్లపై చార్జీల బాదుడు తగ్గింపు వంటి పలు అంశాలను కూడా యూనియన్లు వాటి డిమాండ్లలో చేర్చాయి.
బ్యాంకుల సమ్మెకు తెలుతున్నట్లు తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి రాంబాబు చెప్పారు. శుక్రవారం (అక్టోబర్ 18, 2019) తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్యలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ...ఇటీవల పది ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సమ్మె తలపెట్టినట్లు తెలిపారు. ఈ విలీన చర్యను కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. 10 బ్యాంకులు 4 బ్యాంకులగా విలీనమైతే ప్రభుత్వ రంగం బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 తగ్గిపోతుందన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం, విలీనాలతో బ్యాంకుల ప్రైవేటీకరణకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల విలీనంతో ఉద్యోగులు తగ్గిపోతారని, దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి పోతుందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం కార్పొరేట్ వర్గాలకు దగ్గరవుతున్నదని, ఇది ఉద్యోగ పాలిట శాపంగా మారనున్నదన్నారు.
★బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయం.
★ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ)కు నోటీసు అందజేత.
★విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన.
★ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే బ్యాంకింగ్‌ కష్టాలు తీరతాయని.. దానికి విలీనం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
★సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ.
★ఈ నోటీసులో మొత్తం ఆరు అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :