Wednesday, October 30, 2019

APPSC-AP government sensational decision on job replacement



Read also:

APPSC: ఉద్యోగాల భర్తీపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

APPSC | ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావులేకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC నిర్వహించే పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూలను రద్దుచేయాలని కొద్ది రోజుల క్రితమే కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏపీపీఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగాలకు ఇక ఇంటర్వ్యూలు ఉండవు. ఇంటర్వ్యూల రద్దు నిర్ణయం తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్. ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు ఐఐఎం, ఐఐటీతో పాటు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీపీఎస్సీ మార్గదర్శకాల జారీకి కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రతీ ఏడాది జనవరిలోనే ఎగ్జామ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏపీపీఎస్సీకి వైఎస్ జగన్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు. ఆయా ఖాళీల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలకు తావులేకుండా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐఐఎం, ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారం తీసుకోవడం ద్వారా పరీక్షల నిర్వహణలో స్థానిక అధికారుల ప్రమేయం తగ్గుతుంది. దాంతో పాటు ప్రశ్నాపత్రాల రూపకల్పన దగ్గర్నుంచి ఫలితాల విడుదల వరకు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :