More ...

Saturday, October 19, 2019

AP Corporation for Outsourced Services



Read also:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కంపెనీల చట్టం 2013 సెక్షన్-8 ప్రకారం అవుట్‌సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో సర్కార్ తెలియజేసింది. ఈ కార్పొరేషన్ ద్వారా కన్సల్టెన్సీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
గత వారమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎఫ్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయం అమలు కోసం.. సాధారణ పరిపాలనశాఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. దీనికి సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్లో చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ దళారీ వ్యవస్థ కట్టడి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి , చెబుతున్నారు. కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాస్థాయిలో విభాగాలు.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నేతృత్వం, ఎక్స్ అఫిషియోగా కలెక్టర్ ఉంటారు. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఒకే పనికి ఒకే రకమైన వేతనం.. అది కూడా ఆన్‌లైన్ పద్ధతిలో జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. పోర్టల్ ద్వారా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
Incorporation of Andhra Pradesh Corporation for Outsourced Services under Section 8 of the Companies Act, 2013, as a non-profitable organization, under the administrative control of General Administration Department - Orders - Issued.G.O.MS.No. 126.

The Government of Andhra Pradesh has framed policy and guidelines on recruitment of persons on Outsourcing/Contract basis and also on engaging the Agencies for outsourcing support services along with emoluments etc. During the implementation of the policy, several complaints have been received against engaging the services of Outsourcing Agencies including these Agencies not passing the full remuneration to the outsourced employees in many instances.

Against this backdrop, Government felt it necessary to incorporate a dedicated Corporation that will directly outsource manpower to various Departments/Organisations in the State as per their requirements. It will do away with the involvement of middlemen and other agencies, and create a transparent system for providing outsourced employees and services to the Departments/Organisations across the State, thereby extending maximum benefits to the outsourced employees. The Corporation will also hire agencies to provide services such as consultancy, security and facility management and other services such as housekeeping, vehicles, etc. The Corporation will act as one-stop-shop to the Departments/Organisations for centralized hiring of outsourced employees and services in the State.

Keeping in view of the above, the Government hereby accord approval for incorporating, “Andhra Pradesh Corporation for Outsourced Services”, under Section 8 of the Companies Act, 2013, as a non-profit organization, which will be under the administrative control of General Administration Department.

The G.A. (SU.I) Department shall take necessary further action for the formation of the Corporation immediately.  

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :