Thursday, October 31, 2019

AP CM Key Decisions for Education Development



Read also:


విద్యాభివృద్ధికి ఏపీ సీఎం కీలక నిర్ణయాలు

  • విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహణ.
  • పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై కమిటీ సిఫార్సులపై చర్చ.
  • రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వ్యాఖ్య. ‘వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడుతున్నాం.
  • విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి. టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం.
  • స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి.  పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నీచర్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు.
  • పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి’అని సీఎం వెల్లడి.
  • ప్రైవేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి. చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి.
  • విద్యా అనేది వ్యాపారం, డబ్బు కోసం కాదు. ఇది ఒక ఛారిటీ. ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఖాలీలను భర్తీ చేయాలి.
  • విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి’అని సీఎం వ్యాఖ్యానించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :