Thursday, October 17, 2019

uninstall these apps from your phone



Read also:

ఇప్పటి యువత పరిస్థితి ఎలావుందంటే నెట్‌ లేనిదే జీవితం లేదనే విధంగా తయారైయ్యింది. అందుకు అనుగుణంగానే ఆహ్లదానికి, ఆనందానికి ఎన్నో సరికొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి యాప్స్‌తో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. యూజర్ల దగ్గర నుంచి నగదు, కీలక సమాచారాన్ని లాగేందుకు కొత్త పంధాలను ఫాలో అవుతున్నారు. సరికొత్త పేర్లతో కొత్తరకమైన యాప్స్ రూపొందించి.. వాటిని జనాలు ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ఆకర్షిస్తున్నారు.ఇక ఆ యాప్స్ ద్వారా మాల్‌వేర్ వైరస్‌లు స్మార్ట్ ఫోన్‌లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో మన విలువైన సమాచారం దొంగల చేతికి అందుతోంది.
ఇక ఈ సమాచారంతో జల్లెడపట్టిన గూగుల్ సంస్థ.. కొన్ని డేంజరస్ యాప్స్‌ను గుర్తించింది. అవన్నీ రూల్స్‌కు విరుద్ధంగా ఉండటంతో.. యూజర్లు వీటి విషయంలో అలెర్ట్‌గా ఉండాలని గూగుల్ హెచ్చరించింది. ఇలాంటివి ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలంటూ సూచించింది. ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి సుమారు 29 యాప్స్‌ను తొలిగించింది కూడా.
ఇకపోతే బ్రిటిష్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోఫోస్ వివిధ ఉపయోగరమైన యాప్స్‌తో పాటు కొన్ని హానికరమైన యాప్స్‌ కూడా ప్లేస్టోర్‌లో దాక్కుని ఉన్నాయని వెల్లడించింది.. ఈ మోసపూరితమైన యాప్స్‌ ద్వారా వినియోగదారుల గోప్యతకు ముప్పుతో పాటు, వాటి డెవలపర్‌ అక్రమాదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. పరిశోధనా సంస్థ సోఫోస్ ప్రకారం వీటిని ప్రస్తుతం గూగుల్‌ తొలగించినప్పటికీ, ఈ 15 యాప్స్‌ 1.3 మిలియన్లకు పైగా మొబైల్స్‌లో డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది. 2019 జనవరి- జూలై మధ్య ఇవి ఇన్‌స్టాల్‌ అయ్యాయని తెలిపింది. ఇక వాటి వివరాలు.
ఇమేజ్ మ్యాజిక్ జెనరేట్‌ ఈవ్స్‌, సేవ్‌ ఎక్స్‌పెన్స్‌, క్యూఆర్‌ ఆర్టిఫాక్స్‌, ఫైండ్‌ యువర్‌ మొబైల్‌, స్కావెంజర్ స్పీడ్‌, ఆటో కటౌట్ ప్రో, రీడ్‌ క్యూఆర్‌ కోడ్, ఫ్లాష్ కాల్స్ & మెసేజ్‌, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌, ఆటో కటౌట్, ఆటో కటౌట్ 2019. ఇవి గనుక మీ మోబైల్‌ల్లో ఉంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి, యాప్స్‌, నోటిఫికేషన్‌లోకి వెళ్లి, రీసెంట్‌ యాప్స్‌ చెక్‌చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే, వెంటనే వాటిని అన్‌ ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది. ముఖ్యంగా అవసరం లేకపోతే ఎలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని యూజర్లకు సూచిస్తోంది. ఇక వెంటనే మీ మోబైల్లో ఇవి ఉన్నాయో, లేవో సరిచూసుకోండి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :