Tuesday, October 8, 2019

Training of grama sachivalayam employees in two further installments



Read also:

కొత్తగా నియమితులైన ఉద్యోగులకు వారు విధులలో చేరక మునుపే సెప్టెంబర్ 30, అక్టోబర్2వ తేదీ మధ్య రెండు రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. 

Training of grama sachivalayam employees in two further installments

కొత్తగా నియమితులైన ఉద్యోగులకు వారు విధులలో చేరక మునుపే సెప్టెంబర్ 30, అక్టోబర్2వ తేదీ మధ్య రెండు రోజుల పాటు ప్రాథమిక శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే.

  • ఉద్యోగులందరికీ అక్టోబర్14వ తేదీ నుంచి వచ్చే నవంబర్ 16వ తేదీ మధ్య ఒక్కొక్కరికీ ఆరు రోజుల చొప్పున విడతల వారీగా శిక్షణ ఉంటుంది.
  • జిల్లాలో మొత్తం ఉద్యోగులను ఐదు బ్యాచ్‌లుగా వర్గీకరించి అక్టోబరు 14-19 తేదీల మధ్య ఒక బ్యాచ్‌కి, 21-26 తేదీల మధ్య రెండో బ్యాచ్‌కి, అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు మూడో బ్యాచ్‌కి, నవంబరు 4-9 తేదీల మధ్య నాలుగో బ్యాచ్‌కి, నవంబరు 11-16 తేదీల మధ్య ఐదో బ్యాచ్‌కి శిక్షణ ఇస్తారు.
  • మలి విడతలో ఆయా ఉద్యోగ విధుల ఆధారంగా ఆయా శాఖల ద్వారా వేరుగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించారు.
  • పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ -5 ఉద్యోగులకు నవంబరు 18 తేదీ నుంచి వచ్చే ఏడాది మే 9వ తేదీ మధ్య ప్రతి ఒక్కరికీ రెండు వారాల చొప్పున విడతల వారీగా జిల్లాలో శిక్షణ ఇస్తారు.
  • డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగులకు నవంబరు 18వ తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 28 తేదీల మధ్య ఒక్కొక్కరికీ రెండు వారాల చొప్పన విడతల వారీగా శిక్షణ కార్యక్రమం ఉంటుంది.
  • మిగిలిన ఉద్యోగులకు నవంబరు 18వ తేదీ నుంచి ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించి సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ ఆయా శాఖాధిపతులను కోరింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :