Sunday, October 20, 2019

8000 volunteer posts



Read also:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 8 వేల విద్యావాలంటీర్ల పోస్టులు

ఏపీలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో దాదాపు 8 వేల విద్యావాలంటీర్ల పోస్టుల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని సర్దుబాటు కింద ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను విద్యాశాఖ లెక్క తేల్చింది. మొత్తం పోస్టుల్లో 2,400 ఎస్జీటీ పోస్టులు కాగా.. మిగతావి స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాలకు ఎంపికైన ఎస్జీటీ టీచర్లకు రూ.5000, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు రూ.700 జీతంగా చెల్లించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి విద్యావాలంటీర్లను నియమించనున్నారు.విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి సంబంధించి అత్యధికంగా తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో 800 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 100 చొప్పున పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :