Friday, September 20, 2019

మొబైల్ నుంచే ఇక జనరల్ , ప్లాట్ ఫాం వే టికెట్లు



Read also:

మొబైల్ నుంచే ఇక జనరల్ , ప్లాట్ ఫాం వే టికెట్లు 

రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి . రిజర్వేషన్ అయితే కి ఏ సమస్య ఉండదు , కానీ జనరల్ టికెట్లెన .ప్లాట్ ఫాం టికెట్లిన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి , ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన టైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి . అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ ( క్రీస్ ) అభివృద్ధి చేసిన ఈ ఆన్ లైన్ యాప్ ను మొబైల్ లోని ప్లే స్టోర్  నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు . 

ఎలా ఉపయోగించాలి . ఎలా టికెట్ బుక్ చేసుకోవాలో చూద్దాం

* ముందుగా ఆ యాప్ లో మన డీటైయిల్స్ ఎంటర్ చేయాలి .
* విజయవంతంగా ఎంటర్ చేశాక రైల్వే వ్యాలెట్ ఆటోమేటిక్ గా క్రియేటవుతుంది .
* ఈ ఆర్ వ్యాలెట్లో నగదు కూడా జమ చేసుకోవచ్చు . ఆ తర్వాత కోరుకున్న చోట లేదా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ టికెట్ ను బుక్ చేసుకోవాలి .
* అయితే పేపర్ టికెట్ కావాలనుకున్నవాళ్లు ఆన్ లైన్ చేశాక సంబంధిత స్టేషన్ కు చేరుకున్నాక అక్కడ ఉన్న ఏపీటీఎం మిషన్ లో బుకింగ్ ఐడీ , టికెట్ వివరాలు ఎంట్రీ చేస్తే టికెట్ వస్తుంది .
* అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఎంటంటే అక్కడ టికెట్ తీసుకున్న గంటలోపే మనం ప్రయాణం మొదలెట్టాలి .
* అలా అని మనం రైల్వే స్టేషన్ లో ఉండి టికెట్ బుక్ చేసుకునే సదుపాయం మాత్రం లేదు .
* ఫ్లాట్ ఫామ్ టికెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం లేదు కానీ టికెట్  బుక్ చేసుకున్న పేపర్ టికెట్ తీసుకుంటే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వీలుంది .
* అది ఎలాగో మనం డౌన్ లోడ్ చేసుకున్న యూటీఎస్ యాప్ లో ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :