Tuesday, September 3, 2019

The theme of the Today History 3-09-2019



Read also:

The theme of the Today History

ఈరోజు చరిత్ర లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ,జననాలు ,మరణాలు  మరియు పండగలు వివరాలు. 
Information about history, birth, death, festivals, events on this day.


సంఘటనలు

1831 : కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబర్ 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
2009: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.


జననాలు

1893: కాంచనపల్లి కనకమ్మ, సంస్కృతాంధ్ర రచయిత్రి. (మ.1988)
1905: కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, సుప్రసిద్ధ కవి మరియు రచయిత. (మ.1986)
1905: కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991)
1908: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953)
1924: కావూరి పూర్ణచంద్రరావు - అష్టావధాని, గ్రంథరచయిత.
1935: శరద్ అనంతరావు జోషి, ప్రముఖ రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (మ.2015)
1965: కార్లోస్ ఇర్విన్ ఎస్టవెజ్, అమెరికన్ నటుడు.
1971: కిరణ్ దేశాయ్, భారతదేశ ప్రముఖ రచయిత్రి.
1974: మల్లి మస్తాన్‌ బాబు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పర్వతారోహకుడు. (మ.2015)
1978: అర్జన్ బజ్వా,ఒక భారతీయ సినీ నటుడు.ఎక్కువగా బాలీవుడ్ మరియు తెలుగు సినిమాల్లో నటించాడు.


మరణాలు

1962: వినాయకరావు కొరాట్కర్, మాజీ భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1895)
1969: హొ చి మిన్ వియత్నాం సామ్యవాద నాయకుడు మరియు ఫ్రెంచ్ వారి వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన వియత్నాం పోరాటంలో ముఖ్య సూత్రధారి. (జ.1890)
1987: రమేష్ నాయుడు, సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. (జ.1933)
2011: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ప్రముఖుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
2011: ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. (జ.1921)


పండుగలు మరియు జాతీయ దినాలు

ఖతర్ స్వాతంత్ర్యదినోత్సవం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :