Monday, September 16, 2019

భారీగా పెరిగిన బంగార, వెండి ధరలు



Read also:

మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.అసలు కారణం ఇదే

భారతదేశంలో కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు రోజురోజూకు పెరుగుతునే ఉన్నాయి. అటు వెండి ధర కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తోంది.  కొద్ది రోజులుగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతునే ఉన్నాయి.  అయితే ఇది చాలదన్నట్లుగా పసిడి ధరలు మరింతగా పెరుగుతుండటం సామాన్యులను ఆందోళన కల్గించేలా ఉంది. నేడు మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో సోమవారం బంగారం ధర 460 రూపాయలు పెరిగి గ్రాముకు  రూ. 38,860 రూపాయలకు చేరుకుంది.  వెండి రూ .1,096 పెరగడంతో  ఒక కిలో వెండి ధర రూ .47,957 కు చేరుకుంది.
Gold
సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు ప్రాసెసింగ్ యూనిట్ పై  శనివారం జరిగిన డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగాయి.  దీంతో రూపాయి బలహీన పడింది.డాలర్ తో పోలిస్తే రూపాయి 71.67కు చేరుకుంది.  హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం మరియు ముడి చమురు ధరలు భారీగా పెరగడం వల్ల బంగారం ధర పెరిగిందని వెల్లడించింది. సోమవారం, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, భారత రూపాయి 71.60 వద్ద ట్రేడవుతోంది, డాలర్‌తో పోలిస్తే 68 పైసలు తగ్గింది.  గ్లోబల్ మార్కెట్ లో  బంగారం ఔన్సు 1,504 డాలర్లు, వెండి న్యూయార్క్‌లో ఔన్సు 17.87 డాలర్లుగా ఉంది.  పెరుగుతున్న ధరలు ఎంతకాలం కొనసాగుతాయో తెలియదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

For English Readers

After the Union Budget in India, gold and silver prices continue to rise daily. The price of silver is also rising. The toddler prices have been skyrocketing over the past few days. However, it seems that the rising cost of toddlers is a common concern. The prices of gold and silver have increased further in the market today. Gold price at the Delhi market on Monday rose by Rs 460 to Rs. 38,860 to Rs. Silver rose by Rs 1,096 to Rs 47,957 per kg.

World oil prices have risen sharply following Saturday's drone strikes on Saudi Arabia's largest oil processing unit. The rupee weakened. The rupee touched a low of 71.67 against the dollar. According to HDFC Securities, the weakening of the rupee against the dollar and the sharp rise in crude oil prices have led to increased gold prices. On Monday, the Indian rupee was trading at 71.60 a barrel, down 68 paise against the dollar, due to rising crude oil prices. In the global market, gold is $ 1,504 an ounce, while silver is in New York at $ 17.87 an ounce. Experts say they don't know how long the rising prices will last.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :