Monday, September 16, 2019

త్వరలో పెరగనున్న పెట్రో ధరలు



Read also:

త్వరలో పెరగనున్న పెట్రో ధరలు.డ్రోన్ దాడే కారణం

పెట్రోలు ధరలు పెరగడమే కానీ.. తగ్గడం మాత్రం చాలా అరుదు. తగ్గినా ఒక పైసా లేదా రెండు పైసలు తగ్గుతుంది. పెరిగితే మాత్రం ఒకేసారి రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు.. ఇలా పెరుగుతూ పోతూనే ఉంటుంది. నేటి జనరేషన్ వాహనం లేనిదే బయట అడుగు పెట్టదు. అందుకే రోజు రోజుకూ పెట్రోల్, డీజిల్ కు డిమాండ్ పెరిగిపోతోంది. అయితే... తాజాగా భారత్ లో పెట్రో ధరలు మరోసారి పెరగబోతున్నాయి. గత వారం సౌదీ అరేబియాలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ కంపెనీలో జరిగిన డ్రోన్ దాడే దానికి కారణం. సౌదీలోని అరామ్కో ఆయిల్ రిఫైనరీ ప్రపంచంలోనే పెట్రో ఉత్పత్తుల ప్రాసెసింగ్ చేసే అతి పెద్ద కంపెనీ. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే 15 రోజుల్లో లీటర్ పై 5 నుంచి 7 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 20 శాతం పెరిగాయి. ఒక రోజులో 20 శాతం ధరలు పెరగడం అనేది రికార్డు. 1991, జనవరి 14 తర్వాత ఒక రోజులో ఇంత శాతం జంప్ అవడం ఇదే తొలిసారి. 

డ్రోన్ దాడి వల్ల సౌదీలోని అబక్ అండ్ ఖురాయిస్ లో ఉన్న క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బతిన్నాయి. దీంతో కంపెనీ తమ ప్రొడక్షన్ ను సగానికి సగం తగ్గించింది. వచ్చే రెండు రోజుల వరకు ఆయిల్ ప్రొడక్షన్ ను సగం వరకు తగ్గించనున్నట్టు ఆయిల్ కంపెనీ ప్రకటించింది. త్వరలోనే దెబ్బతిన్న క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేస్తామని.. ఆ తర్వాత ప్రొడక్షన్ పెంచుతామని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వచ్చే 15 రోజుల్లో లీటర్ పై 5 నుంచి 7 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది.హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్రకారం... క్రూడ్ ఆయిల్స్ ధరలు ప్రస్తుతం ఉన్నట్టుగా స్థిరంగా ఉన్నా పెట్రో ధరలు మాత్రం పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్స్ ధరలు 10 శాతం వరకు పెరిగితే పెట్రో ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

నిజానికి... మిడిల్ ఈస్ట్ దేశాల్లో గత 15 రోజుల సరాసరి పెట్రో ధరల ఆధారంగా భారత్ లో పెట్రో మార్కెటింగ్ కంపెనీల్లో పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తారు.

For English Readers

Petrol prices are on the rise but the decline is very rare. A penny or two will decrease. If the increase is only one rupee, two rupees, and five rupees .. it will continue to grow. Today's Generation will not step outside without a vehicle. That is why the demand for petrol and diesel is increasing day by day. However, in India, petrol prices are going up again. The drone strike was the cause of the Aramco Oil Refinery in Saudi Arabia last week. Saudi Arabia's Aramco Oil Refinery is the largest processing company of Petrol products in the world. According to current estimates, it is likely to increase from Rs 5 to Rs 7 per liter over the next 15 days. Brent crude oil prices are up 20 percent in the international market. Prices go up 20 percent in one day. This is the first time such a percentage jump has occurred in a day since January 14, 1991.

The crude oil wells in Abak and Quraysh, Saudi Arabia, were damaged by the drone attack. The company cut its production by half. The oil company has announced that it will cut its oil production by half in the next two days. The damaged crude oil wells will be repaired soon. According to the current estimates, the price of petrol is likely to increase by Rs 5 to Rs 7 per liter in the next 15 days. Crude oil prices are expected to increase further if prices of crude oil are up by 10 percent.

In fact, the price of petrol and diesel in petrol marketing companies in India is determined based on average petrol prices over the past 15 days in Middle East countries.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :