Friday, September 6, 2019

Interesting facts about chandrayaan2 and live video



Read also:

Interesting facts about chandrayaan2 and live video

భారతీయులే కాదు యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై అధ్యయనానికి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 నేటి అర్థరాత్రి కీలక ఘట్టానికి సిద్ధమైంది.
chandrayaan2
  • చందమామపై భారత కీర్తిపతాక రెపరెపలాడే సమయం ఆసన్నమైంది. 
  • భారతీయులు ఆశల్ని మోసుకుంటూ జులై 22న నింగివైపు దూసుకెళ్లిన చంద్రయాన్-2 మరి కొద్ది గంటల్లో తన లక్ష్యాన్ని చేరుకోనుంది. 
  • చంద్రయాన్-2 48 రోజుల సుదీర్ఘ ప్రయాణం ఒక ఎత్తైతే, చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెట్టడానికి ముందు 15 నిమిషాలు ఒక ఎత్తు. 
  • ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుంది.
  • శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు చంద్రుడి కక్ష్య నుంచి ఉపరితలంపై దిగే క్రమంలో శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’ ల్యాండర్‌కు సంకేతాలు పంపుతారు. 
  • అంతా సవ్యంగా ఉందని నిర్ణయానికి వచ్చాక 78 నిమిషాల అనంతరం ల్యాండర్‌ను ఉపరితలంపై దింపడానికి ఆదేశాలు పంపనున్నారు.
  • ఆ సమయంలో ల్యాండర్ వేగం 6,120 కిలోమీటర్లు ఉండగా.. జాబిల్లికి 35×100 కిలోమీటర్ల కక్ష్యలో ఉంటుంది. 
  • ఇస్రో నుంచి సంకేతాలు అందగానే ల్యాండర్‌లోని థ్రాటుల్‌ ఏబుల్‌ ఇంజిన్లు మండటం ఆరంభిస్తాయి. 
  • ఇవి ల్యాండర్‌ గమనానికి వ్యతిరేక దిశలో మండుతూ వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. అనంతరం ల్యాండర్‌ కిందకు దిగడం మొదలవుతుంది.
  • చంద్రుడిపై విక్రమ్‌ దిగే సమయానికి అక్కడ సూర్యోదయమవుతుంది. దీంతో ఈ వ్యోమనౌక తన సోలార్ ఫలకాల ద్వారా బ్యాటరీలను రీఛార్జి చేసుకుంటుంది. 
  • భూ కేంద్రంతో నేరుగా హై బ్యాండ్‌విడ్త్‌ లింక్‌ను ఏర్పాటు చేసుకొని సంభాషిస్తుంది. 
  • తన పరిధిలోకి వచ్చినప్పుడల్లా ఆర్బిటర్‌తోనూ కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. 
  • తొలుత ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్‌ పనితీరును పరిశీలించిన అనంతరం చంద్రుడి ఉపరితల కార్యకలాపాలు మొదలవుతాయి.
  • విక్రమ్ ల్యాండింగ్‌ సమయంలో పైకి లేచే చంద్రుడిపై ధూళి నాలుగు గంటల తర్వాత సర్దుకుంటుంది. 
  • అప్పుడు ల్యాండర్‌ నుంచి ర్యాంప్‌ విచ్చుకోగా, దాని మీద నుంచి ‘ప్రజ్ఞాన్‌’ రోవర్‌ కిందకు దిగుతుంది. 
  • అయితే, ఈ రోవర్‌ నేరుగా భూ కేంద్రంతో అనుసంధానించలేదు. ఆర్బిటర్‌తో మాత్రమే కమ్యూనికేషన్‌ సాగిస్తుంది. ఈ రోవర్‌పై భారత జాతీయ పతాకాన్ని, ఇస్రో లోగోను చిత్రీకరించారు.
  • చంద్రుడి దక్షిణ ధ్రువానికి 350 కిలోమీటర్ల ఉత్తరాన మాంజినస్‌ సి, సింపెలియస్‌ ఎన్‌ అనే రెండు బిలాల మధ్య ప్రాంతంలో ల్యాండర్‌ దిగనుంది. 
  • విక్రమ్ 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు కొన్ని సెకన్ల పాటు అక్కడ తిరుగాడుతుంది. ల్యాండింగ్ సైట్‌లో 500 మీ x 500 మీ, 1.6 కిలోమీటర్ల పరిధిలో రెండు జోన్లను గుర్తించిన శాస్త్రవేత్తలు, తొలి జోన్‌లోనే ల్యాండర్‌ను దింపాలని నిర్ణయించారు. 
  • ఇక, జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్‌, అమెరికాకు చెందిన ఎల్‌ఆర్‌వో ఆర్బిటర్లు అందించిన చిత్రాలు, డేటాను విశ్లేషించిన ఇస్రో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది.
  • ప్రాథమిక, బ్యాకప్ సైట్ రెండూ ల్యాండింగ్ రోజున సూర్యకిరణాలు ఆరు డిగ్రీల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటాయని ఇస్రో భావిస్తోంది.
  • దీని వల్ల చంద్రుడి గురించి ఫోటోలను తీయడానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం నుంచే ల్యాండర్ తన ల్యాండింగ్ సైట్ చిత్రాలను తీస్తోంది.
  • ప్రాథమికంగా ఎంపికచేసిన జోన్‌లో ల్యాండర్ దిగగలిగితే విక్రమ్ నేరుగా 65 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుంది. 
  • ఒకవేళ రెండో ల్యాండింగ్ సైట్‌ను ఎంచుకుంటే తొలుత 60 మీటర్లు కిందకు దిగడానికి 40 సెకన్లు పడుతుంది. 
  • తర్వాత 25 సెకన్లలో 10 మీ ఎత్తుకు చేరుకుంటుందని శాస్త్రవేత్త వివరించారు. 
  • 10 మీటర్లకు చేరుకున్న తర్వాత ఉపరితలంపై దిగేందుకు 13 సెకన్లు పడుతుంది.
  • అమెరికాకు చెందిన అపోలో-16, సర్వేయర్‌-7లు మాత్రమే ఇప్పటివరకూ ఎగువ మైదాన ప్రాంతాల్లో దిగాయి.
  • మిగతా వ్యోమనౌకలన్నీ చీకటిమయంగా ఉండే, నున్నగా ఉండే లావా మైదాన ప్రాంతాల్లో కాలుమోపాయి. 
  • చంద్రయాన్‌-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :