Thursday, September 19, 2019

డేంజర్‌ బెల్స్‌ 36 గంటల్లో 8 కోట్ల మందిని చంపగల వైరస్‌



Read also:

ఒక తీవ్రమైన ఫ్లూ మహమ్మారి, మూలం తెలియనిది. వందేళ్ల క్రితం అంటే, 1919లో 'స్పానిష్‌ ఫ్లూ' మూడొంతుల ప్రపంచాన్ని చుట్టుముట్టడంతో దాదాపు ఐదు కోట్ల మంది మరణించారు. అలాంటి వైరస్‌ ఇప్పుడు ప్రపంచానికి సోకితే కేవలం 36 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి.. 80 మిలియన్ల మందిని మరణానికి కారణం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ నిపుణుల బృందం పూర్తిగా హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్‌ నాయకత్వంలోని 'గ్లోబల్‌ ప్రిపేర్డ్‌నెస్‌ మానిటరింగ్‌ బోర్డ్‌' సభ్యుల బృందం ఈ హెచ్చరికలను చేసింది.

ఈ మేరకు 'ఏ వరల్డ్‌ ఎట్‌ రిస్క్‌' శీర్షికతో రూపొందించిన ఓ నివేదికను బుధవారం అమెరికాలో విడుదల చేసింది. అత్యంత ప్రమాదకరమైన ఫ్లూలు ప్రపంచానికి సోకే ప్రమాదం ఉందని.. దీని వల్ల 50 నుండి 80 మిలియన్ల మంది ప్రజలను చంపగల ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధికారక ముప్పు ఉందని హెచ్చరించింది. అలాంటి వైరస్‌లను ఇప్పటి నుంచి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ - జనరల్, నార్వే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్‌ గో ఆర్లెం బ్రుండట్లాండ్‌ నాయకత్వంలోని జీపీఎంబీ బృందం హెచ్చరికలను జారీ చేస్తోంది.

అలాగే ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. కొత్త టెక్నాలజీలపై పరిశోధన కోసం నిధులను పెంచడం, సమన్వయం మరియు వేగవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను మెరుగుపరచడం, పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం వంటివి ఆయన సూచించారు.

ఇక ఏ వైరస్‌ ఏ ప్రాంతాన్నీ, ఏ దేశాన్ని సోకే అవకాశం ఉందో కూడా ప్రపంచ పటంపై మార్కు చేసి చూపించింది. అంటే నిఫా వైరస్‌ ఏ దేశాన్ని చుట్టు ముడుతుందో, కలరా ఏ దేశాన్ని… చికెన్‌ గున్యా, డెంగ్యూలాంటి వైరస్‌లు ఏయే దేశాలు చుట్టుముడుతాయో మ్యాప్‌లో సూచించింది. వాటికి సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు ఏమిటో కూడా సూచించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :