Wednesday, September 4, 2019

నేటి మంత్రివర్గ సమావేశం హైలట్స్



Read also:

నేటి మంత్రివర్గ సమావేశం హైలట్స్

సిఎం జగన్‌ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన ఏపి కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ నూతన ఇసుక విధనాన్ని జగన్ సర్కారు ఆవిష్కరించింది. ఈ విషయమై ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. శాండ్ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుకను తక్కువ ధరకే సరఫరా చేస్తామని తెలిపారు. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారానే ఇసుకను తరలిస్తామని వెల్లడించారు. ఎవరూ ఇసుకను స్టాక్ పెట్టుకునేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

ఏపీలో ఇసుకను స్థానిక అవసరాల కోసమే వాడాల్సి ఉంటుందనీ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఇసుక రీచ్ ల వద్ద టన్ను ఇసుకను రూ.375కి అమ్ముతామనీ, వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను టన్నుకు రూ.60న కొంటామని పేర్కొన్నారు.

ఈ నెల 10 నుంచి ఇసుకను ఎపీఎండీసీ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చన్నారు. రేపటి నుంచి ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశంలోని ఇతర కీలక నిర్ణయాలు ఇవే..

•ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలన్న ఆంజనేయ కమిటీ నివేదికకు కేబినెట్ యథాతథంగా ఆమోదం తెలిపింది. ఇకపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే.

•ఏపీలో కొత్తగా ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటు. 52 లక్షల ఆర్టీసీ ఉద్యోగులను ఇందులోకి తీసుకుంటాం.

•గత ఐదేళ్ల కాలంలో ప్రత్యేక హోదా కోసమ ఉద్యమించిన వారిపై నమోదైన కేసులు ఎత్తివేయాలని నిర్ణయం.

•రాష్ట్రంలో బస్సు చార్జీల నియంత్రణకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న కమిషన్ ఏర్పాటు.

•ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 60కి పెంపు.

•సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్ లు నడుపుకునేవారికి ఏడాదికి రూ.10,000 ఆర్థిక సాయం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. ఇందులో భార్యాభర్త ఒక యూనిట్ గా, మేజర్ అయిన కుమారుడు లేదా కుమార్తెను ప్రత్యేక యూనిట్ గా గుర్తిస్తాం.

•శ్రీరామనవమి నుంచి ఖవైఎస్సార్ పెళ్లి కానుకగ పథకం అమలు.

•ఆశావర్కర్ల జీతాల పెంపునకు కేబినెట్ ఆమోదం. గౌరవవేతనం రూ.3,000 నుంచి రూ.10,000 కు పెంపు. డేటా అప్ డేట్ అయ్యాక ఈ వారాంతంలో వేతనాలు జమచేయాలని నిర్ణయం.

2019, జనవరి నుంచి టీడీపీ సర్కారు జీతాలు ఇవ్వలేదు. ఈ మొత్తం రూ.132 కోట్లను ఇప్పుడు విడుదల చేశాం.

•వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పథకం ప్రారంభం. దీనికింద జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించే క్రీడాకారులకు రూ.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధిస్తే రూ.4 లక్షలు. కాంస్య పతకం సాధిస్తే రూ.3 లక్షలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం.

టీడీపీ హయాంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన ఆటగాళ్లకు న్యాయం చేయాలని నిర్ణయం. దరఖాస్తు చేసుకోవాలని సదరు ఆటగాళ్లకు సూచించాం.

•తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల సంఖ్యను 18 నుంచి 24 కు పెంచుతూ నిర్ణయం.

•ప్రపంచ బాడ్మింటన్ షిప్ సాధించిన క్రీడాకారిణి పీవీ సింధూకు కేబినెట్ అభినందనలు.

•కృష్ణా జిల్లా నాగాయలంక సంగమేశ్వరంలో డీఆర్డీవో కోసం రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థ. ఇందుకోసం 5 ఎకరాల భూమిని కేబినెట్ నిర్ణయం.

•ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం సందర్భంగా ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచేలా ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాయాలని కేబినెట్ తీర్మానం.

•చిత్తూరు, కడప జిల్లాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కు ఇంటర్మీడియట్ లెవల్ పంపింగ్ కోసం 25 ఎకరాల కేటాయింపు.

నడికుడిశ్రీకాళహస్తి మధ్య బ్రాడ్ గేజ్ నిర్మాణం కోసం ప్రకాశం జిల్లాలో 20 ఎకరాలు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపు

•బలిమెల మావోయిస్టు దాడిలో అమరుడైన ఏపీఎస్పీ అధికారి వెంకట్రావు కుటుంబానికి గుంటూరు జిల్లాలో 10 సెంట్ల భూమి కేటాయింపు. ఎలాంటి ధర చెల్లించకుండానే కేటాయించిన సర్కారు.

•మచిలీపట్నం పోర్టు పనుల కోసంమచిలీపట్నం పోర్టు లిమిటెడ్గకు కేటాయించిన 412 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని మంత్రిమండలి నిర్ణయం. గత పదేళ్లలో పనులు ప్రారంభం కాకపోవడంతో చర్యలు. ఇప్పటివరకూ లీజు కూడా చెల్లించని కంపెనీ.

•2005 నుంచి సీపీఐమావోయిస్టు, దాని అనుబంధ సంఘాలపై కొనసాగుతున్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగింపు.

•పోలవరం హైడల్ ప్రాజెక్టు నవయుగ కంపెనీకి గతంలో కేటాయించడాన్ని రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :