Thursday, September 19, 2019

have you know the X symbol of in rail bhogi



Read also:

రైలులో చివరి బోగి వెనుక ఆంగ్ల అక్షరం ' X'ఎందుకు రాసి ఉంటుందో తెలుసా  

రైలు అంటే ప్రతి ఒక్కరికి తెలుసే . ప్రతి ఒక్కరు రైలు ఎక్కే ఉంటారు . రైలు ఎక్కని వారంటూ ఉండరేయో . రెగ్యూలర్ గా రైలు ప్రయాణం 3 చేయకున్నా ఎప్పుడో ఓ సారి ఎక్కే ఉంటారు . అయితే అసలు విషయం మాత్రం అది కాదండి . ఎందుకంటే ఆ ప్రశ్నకు ఇంకా కొనసాగింపు ఉంది . ఆ అదేమిటంటే . రైలు ఎక్కడానికి స్టేషన్ కు వెళ్లినప్పుడు రైలు బోగీలను ఆ జాగ్రత్తగా గమనించారా .ప్రధానంగా రైలు చివరి  పెట్టి వెనుక భాగాన్ని - పరిశీలించారా ? పరిశీలించాం , చూశాం . అయితే ఏమిటీ అంటారా ? ఆ  అయితే అక్కడే ఆగండి . రైలు చివరి పెట్టి వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం X అని పెద్దగా రాసి ఉంటుంది , దాన్ని ఎప్పుడైనా చూశారా ? ఇప్పుడు దాని ప గురించే మేం చెప్పబోయేది . అసలు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో.
Tran-x

మీకు తెలుసా ? అయితే ఎందుకో తెలుసుకోండి?

రైలు బోగీల్లో చివరి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టేదే చివరిది అని అర్థం . అంతేకాదు ఆ X అక్షరం కిందే ఓ ఎర్రని లైటు , దాని పక్కనే LV అనే ఓ బోర్డు కూడా తగిలించబడి ఉంటుంది . ఇవన్నీ X అక్షరం లాగే ఉపయోగపడతాయి . వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టెగా  పరిగణిస్తారు . అయితే X అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే , ఎర్రని లైటు రాత్రి పూట ఉపయోగపడుతుంది . దీని వల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని పెట్టెలతోనే వెళ్తుందని అర్థం చేసుకుంటారు . ఒక 2 వేళ రైలు చివరి పెట్టెకు ఈ అక్షరాలు ఏవీ లేకపోతే అది ప్రమాదవశాత్తూ ఆ కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుందని తెలుసుకుంటారు . దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు . సో , రైలు చివరి పెట్టె వెనుక ఉన్న అక్షరాల మతలబు అదన్నమాట.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :