Thursday, September 5, 2019

మొబైల్ వాలెట్ యూజర్లకు శుభవార్త



Read also:

మొబైల్ వాలెట్ యూజర్లకు శుభవార్త

మొబైల్ వాలెట్ వాడే యూజర్ల కేవైసీ వెరిఫికేషన్ గడువును ఆర్బీఐ పొడిగించింది.2020 ఫిబ్రవరి 29 లోపు కేవైసీ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 31లోపు ఫోన్‌పే,గూగుల్‌పే,పేటీఎం వంటి వాలెట్లు వాడే వారు కేవైసీ చేసుకోవాలని సూచించింది. కానీ చాలా మంది కస్టమర్లు దీన్ని పూర్తి చేయకపోవడంతో మరోసారి గడువు పెంచింది. దీని తర్వాత ఇక గడువు ఇచ్చేది లేదని ఆర్బీఐ తేల్చి చెప్పింది.

కేవైసీ చేయించికోని వారు గడువు ముగిసిన తర్వాత మొబైల్ వాలెట్ సేవలను పొందలేరని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. మొబైల్ వాలెట్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధుల వద్ద కానీ, ఆధార్ సాయంతో ఈ-కేవైసీ కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం గడవు పొడిగింపుతో మరికొన్ని రోజులు లావాదేవీలు కొనసాగించే అవకాశం యూజర్లకు దక్కింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :