Wednesday, September 11, 2019

Education committees for schools to be held by the end of the month



Read also:

సర్కారు బడులను సక్రమంగా నిర్వహించడానికి వీలుగా పాఠశాల విద్యా కమిటీలను ఏర్పాటు చేయాలని సర్వశిక్షా అభియాన్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా ఎన్నికలను పూర్తిచేసి అక్టోబరు ఆరంభం నుంచి ఈ కమిటీలు పనిచేసేలా ఆ శాఖ ఉన్నతాధికారి వి.చినవీరభద్రుడు అన్ని జిల్లాలకు విధి విధానాలను విడుదల చేశారు. దీంతో విద్యాశాఖలో ఈ ప్రకియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలాల్లో ఎంఈవో లను ఎన్నికల నిర్వహణ అధికారులుగా నియమించారు. వీరు వివిధ పాఠశాలల్లో ఈ ఎన్నికలను నిర్వహించేందుకు సీనియర్‌ ఉపాధ్యాయులను నియమిస్తున్నారు.

గతంలో పాఠశాల విద్యా కమిటీలకు జరిగిన ఎన్నికల కాల పరిమితి గత ఆగస్టుతో పూర్తియింది. అయినప్పటికీ మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఈ ఎన్నికలకు శ్రీకారం చుట్టింది.

ఎన్నికల నిర్వహణ విధానం


  • పాఠశాలల విద్యా కమిటీని విద్యార్థుల తల్లిదండ్రులతో ఎన్నుకుంటారు.
  • వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు. ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా ఉంటారు.
  • ప్రతి తరగతి నుంచి ముగ్గురు తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుంటారు. ప్రాథమిక పాఠశాలలో గరిష్ఠంగా 15 మంది సభ్యులుండాలి.
  • ఈ విధంగా ఎన్నికైన వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటారు.
  • ఈ ఎన్నికల విధానంలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది.
  • పాఠశాలల అభివృద్ధిలో విద్యా కమిటీలు కీలకపాత్ర వహిస్తాయి. ప్రస్తుతం అమ్మఒడి పథకం. అమలు జరుగుతున్నందున విద్యార్థుల తల్లిదండ్రులచే బ్యాంకు ఖాతాలను తెరిపించడం. అందులో ప్రభుత్వ నిధులు జమ అయ్యేలా చూడడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.

కమిటీల విధి నిర్వహణ

  • ఈ నెలాఖరులోగా ఎన్నికైన కమిటీలకు అక్టోబరు మొదటి వారంలో మండల కేంద్రాలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
  • తర్వాత ప్రతినెలా ఈ కమిటీ సమావేశమవ్వాలి. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులతో పాటు ఇతర సదుపాయాలు కల్పించడానికి వీలుగా తీర్మానాలు చేసి అమలు చేయాలి.
  • ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పాఠశాల నిర్వహణ, ఇతర గ్రాంటులను ఖర్చు చేయడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో జాతీయ బ్యాంకులో ఉమ్మడి ఖాతాను ప్రారంభించాలి.
  • బోధన, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, పిల్లల హాజరు, విద్యా ప్రమాణాల పెంపుదల వంటి పలు అంశాలను ఈ కమిటీలు చూడాల్సి ఉంటుంది. 
  • ఇంతవరకు ఉన్న కమిటీలు నామమాత్రంగా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తినందున కొత్తగా ఎన్నికైన కమిటీలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా చర్యలు తీసుకుంటారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :