Friday, September 13, 2019

chandrayaan2 updated information



Read also:

మనం చంద్రయాన్ 2 లాండర్ విక్రమ్ తో సంబంధాలను కోల్పోయింది, 2.1 కిలోమీటర్ల దూరంలో కాకుండా కేవలం 400 మీటర్ల దూరంలో మాత్రమే అని తెలియవచ్చింది. శనివారం మనం విక్రమ్ తో సంబంధాలను కోల్పోవటం, చంద్రుని ఉపరితలానికి 2.1 కి మీ దూరంలో ఉండగా జరిగిందని ప్రచారం జరిగింది. ఇది ఇస్రో ప్రకటనను సరిగా అర్ధం చేసుకోకపోవడం వలన జరిగిన పొరపాటు వల్ల జరిగిందని ఇస్రో వర్గాలు తెలిపాయి.
Chandrayaan-2
తాజా సమాచారం ప్రకారం చంద్రయాన్ 2 ఆర్బిటార్ క్షేమంగానే ఉంది. తన ప్రయాణంలో ఆర్బిటార్ చేసిన ఇంధన పొదుపు చర్యల వలన మిషన్ లైఫ్ మొదట అనుకున్నట్టు ఒక సంవత్సరం కాకుండా ఏడు సంవత్సరాలకు పొడిగించగలగటం ఒక శుభ పరిణామం.

ఐతే విక్రమ్ లాండర్ మిషన్ లైఫ్ మన కాలమానం ప్రకారం కేవలం 14 రోజులు. అంటే విక్రమ్ తో సంబంధాల పునరుద్ధరణకు ఇస్రో దగ్గర కేవలం 9 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ దిశగా ఇస్రో అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మన శాస్త్రజ్ఞుల కృషి సత్ఫలితాలనివ్వాలని ఆశిద్దాం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :