More ...

Friday, September 6, 2019

రేపే చంద్రయాన్ - 2 అసలు ప్రయోగం .చందమామపై దిగనున్న ల్యాండర్Read also:

ISRO Chandrayaan - 2 : శుక్రవారం అర్థరాత్రి దాటాక . శనివారం మొదలయ్యాక . ఆసియా దేశాలకు తెల్లవారేలోపు .అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది . అదే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ) చేపట్టిన చంద్రయాన్ - 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ . ల్యాండింగ్ . శుక్రవారం రాత్రి దాటాక . 1 . 40 నుంచీ 1 . 55 మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది . ఈ 15 నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి . మనకైతే పెద్దగా టెన్షన్ ఉండదు గానీ . ఇస్రో శాస్త్రవేత్తలకైతే ఊపిరాడదు . క్షణక్షణం ఉత్కంఠీ . ఈ క్షణాల కోసమే వాళ్లు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు . 48 రోజుల కిందట . చంద్రయాన్ 2ను విజయవంతంగా ప్రయోగించారు . అంతరిక్షంలోకి వెళ్లిన ఆర్బిటర్ ప్రయాణం .  క్రమంగా భూమికి దూరమవుతూ . చందమామకు దగ్గరవుతూ సాగింది . నాల్రోజుల కిందటే . చంద్రయాన్ - 2 ఆర్బిటర్ నుంచీ . విక్రమ్ ల్యాండర్ విడిపోయింది . అది చందమామ చుట్టూ తిరుగుతూ . క్రమంగా చందమామకు అత్యంత దగ్గరగా చేరువైంది . ప్రస్తుతం అది చందమామకి 35 కిలోమీటర్లు దగ్గరగా . 101 కిలోమీటర్లు దూరంగా ఉంది . రాత్రి 1 . 40కి అది చందమామ దక్షిణ ధ్రువానికి చేరుతుంది . ప్రస్తుతం చంద్రయాన్ - 2 ఆర్బిటర్ . . చందమామకి 96 కిలోమీటర్లు దగ్గరగా , 125 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో తిరుగుతోంది .
chandrayaan2
ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహం తీసిన చందమామ ఫొటో ( Image : ISRO Twitter ) రాత్రి 1 తర్వాత చందమామ దక్షిణ ధ్రువంలోని రెండు లోయల మధ్యలో ఉన్న సమతలమైన స్థలంలో విక్రమ్ ల్యాండర్ దిగనుంది . ఆల్రెడీ ముందుగా అనుకున్న స్థలం సరిగా లేదని భావిస్తే .  ఆ  చుట్టుపక్కల మరో స్థలాన్ని ఎంచుకుంటారు శాస్త్రవేత్తలు . స్థలం ఎలా ఉందో చూసేందుకు చంద్రయాన్ - 2 ఆర్బిటర్ కి అమర్చిన ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ఉపయోగపడనుంది . ఇలా స్థలాన్ని వెతకడానికి అరగంట సమయం కేటాయిస్తున్నారు . అందువల్ల 1 - 40 సమయంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగుతుందన్నమాట . అలా దిగే సమయంలో దాని వేగం సెకండ్ కి 3 అడుగులు ఉంటుంది . ఇలా దిగడానికి 15 నిమిషాలు పడుతుంది . ఇస్రో చంద్రయాన్ - 2 ప్రయోగంలో ఈ 15 నిమిషాలూ .అత్యంత కీలకమైనవి . ఇది ల్యాండింగ్ సక్సెస్ చెయ్యడం అత్యంత కష్టమైన పని . ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం ప్రయోగమే వేస్టవుతుంది . ఇప్పటిదాకా అమెరికా , రష్యా , చైనా మాత్రమే ఇలా ల్యాండింగ్ చెయ్యగలిగాయి . అందువల్లే ఇస్రో శాస్త్రవేత్తలకు ఇప్పుడు నిద్ర పట్టని పరిస్థితి . ఊపిరి బిగపట్టి అంతా ఈ ప్రయోగ క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు . ఆసియా దేశాలకు తెల్లారిన తర్వాత . మరో ప్రయోగం జరగనుంది . అదే . రోవర్ రాక . సరిగ్గా ఉదయం 5 . 30 నుంచి 6 . 30 మధ్య . విక్రమ్ ల్యాండర్ బాక్సులో నుంచీ . 27 కేజీల బరువుండే . ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది . దానికి ఆరు చక్రాలుంటాయి . అది బయటకు రాగానే దాని సోలార్ ప్లేట్లు తెరచుకుంటాయి . వెంటనే అది సూర్యరశ్మిని స్వీకరిస్తూ . పని మొదలుపెడుతుంది . చుట్టుపక్కల అంతా ఫొటోలు తీస్తుంది . అలాగే . అక్కడే ఉండిపోకుండా . ఓ 500 మీటరు ప్రయాణిస్తుంది . ఇదంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు . ఇందుకు 14 రోజులు పడుతుంది . అంటే . అది మెల్లమెల్లగా వెళ్తుందన్నమాట . నెమ్మదిగా ఎందుకంటే . చందమామపై స్థలం ఎలా ఉందో చూసుకొని . రాళూ , రప్పలను దాటుకుంటూ . జాగ్రత్తగా వెళ్తుంది . అలా వెళ్తు . ప్రతీదీ ఫొటోలు తీస్తూ ఉంటుంది . అందుకే నెమ్మదిగా వెళ్తుందన్నమాట . ప్రజ్ఞాన్ రోవర్ పంపే సమాచారం మొత్తం . . ముందుగా . విక్రమ్ ల్యాండర్ కి చేరుతుంది . అక్కడి నుంచీ బెంగళూరుకి దగ్గర్లోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్ వర్క్కు చేరుతుంది . ఈ ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి చూస్తారు . దేశవ్యాప్తంగా 9 , 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో నిర్వహించిన పోటీల విజేతల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ప్రధానితో కలసి ఈ ల్యాండింగ్ ను చూస్తారు . దీన్ని సక్సెస్ చెయ్యడం ద్వారా . అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో కీలక ముందడుగు వేసినట్లవుతుంది . ఇప్పుడు 500 మీటర్లు మాత్రమే వెళ్లే రోవర్ . భారత భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఓ చరిత్రాత్మక ముందడుగు కాబోతోంది . విక్రమ్ ల్యాండర్ , ప్రజ్ఞాన్ రోవర్ . జస్ట్ 14 రోజులు మాత్రమే పనిచేస్తాయి . ఆ తర్వాత అమావాస్య మొదలవుతుంది . ల్యాండర్ , రోవర్ ఉన్న ప్రాంతంలో . ఎండ పడదు . అందువల్ల అవి రెండు గడ్డకట్టి పనిచేయకుండా పోతాయి . 14 రోజుల తర్వాత తిరిగి ఎండ వచ్చినా . అవి పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదు . ఒక వేళ పనిచేస్తే . అదృష్టమే అంటున్నారు శాస్త్రవేత్తలు . 

చంద్రయాన్ 2 పూర్తి వివరాలు ఇవీ

చంద్రయాన్ 2 అనేది . చందమామ దక్షిణ ధ్రువాన్ని పరిశోధించబోతున్న తొలి మిషన్ . ఇందులో ఆర్బిటర్ , విక్రం అని పిలిచే ల్యాండర్ , ప్రజ్ఞాన్ అనే రోవర్ ఉంటాయి . ఇస్రని స్థాపించిన విక్రమ్ సారాభాయ్ పేరు మీద ల్యాండర్ కు విక్రమ్ అని పేరు పెట్టారు . ప్రజ్ఞాన్ అంటే తెలివితేటలు , నాలెడ్జ్ అని అర్థం . చంద్రయాన్ 2 బరువు 3 , 877 కేజీలు . చంద్రయాన్ 1 కంటే ఇది నాలుగు రెట్లు బరువు ఎక్కువ . చంద్రయాన్ 1 సాంకేతిక లోపంతో చంద్రమామపై కూలిపోయింది . చంద్రయాన్ 2 అనేది రాకెట్ టెక్నాలజీ ద్వారా . ల్యాండర్ ను చందమామపై దించబోతోంది . ఇందుకోసం సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు . రెండు పగులు లోయల ( మాంజినస్ - సి , సింపెలియస్ఎన్ ) మధ్య ఉండే ఎత్తైన మైదానంలో . ల్యాండర్ దిగుతుంది . సెప్టెంబర్ 7న ఇది జరుగుతుంది . ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ . 978 కోట్లు . ల్యాండర్ , రోవర్ కలిపి . 14 రోజులు పనిచేస్తాయి . చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ మాత్రం ఏడాది పనిచేస్తుంది . చందమామ తన చుట్టూ తాను తిరిగేందుకు సుమారుగా 29 . 5 రోజులు పడుతుంది . భూమి చుట్టూ తిరిగేందుకు కూడా అంతే సమయం పడుతోంది . అందుకే మనం చందమామకు ఒకవైపు భాగాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం . ఈ కాలంలో సగం సమయం చందమామపై అంతటా సూర్యుడి కిరణాలు పడతాయి . అంటే దాదాపు 14 రోజుల కంటే కాస్త ఎక్కువ . సెప్టెంబర్ 7న చందమామపై రోవర్ దిగేటప్పుడు . సూర్యకాంతి చందమామపై పడుతుంది . అదే సమయంలో . చందమామ . భూమికి కనిపిస్తుంది . ఇలా 14 రోజులపాటూ సూర్యకాంతి పడుతుంది . అదే సమయంలో ల్యాండర్ , రోవర్ 14 రోజులు పనిచేస్తాయి . అవి రెండు సోలార్ పవర్ తో పనిచేస్తాయి కాబట్టి . సోలార్ పవర్ అయిపోగానే అవి పనిచేయడం మానేస్తాయి . అంటే . 14 రోజుల తర్వాత . ఆ ప్రదేశంలో నీడ పడి . ఉష్ణోగ్రత 180 డిగ్రీల సెల్సియసకి పడిపోతుంది . నెక్స్ట్ 14 రోజుల తర్వాత . తిరిగి ల్యాండర్ , రోవర్ పనిచేస్తే . . అది బోనస్సే అంటోంది ఇస్రో.
AP-Echalan Application for paying the bike, car fines
How to pay RTO fines with android app 

Janardhan Randhi

About Janardhan Randhi

Hi I am Janardhan Randhi,Professionally I am a Application developer but passionate on blogging.I spend a lot of time learning new techniques and actively help other people learn web development through a variety of help groups and writing web development tutorials.

Subscribe to this Blog via Email :