Wednesday, September 4, 2019

మీ ఇంట్లో వేస్ట్ఉందా ఫోన్ చేయండి తీసుకెళతారు



Read also:

మీ ఇంట్లో  వేస్ట్ఉందా ఫోన్ చేయండి తీసుకెళతారు

నగరంలో వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణపై పీసీబీ విస్తృత చర్యలు చేపడుతున్నది . ఇందుకోసం ఈ వేస్ట్ , ప్లాస్టిక్ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది . తొలి ఈ - వేస్ట్ సేకరణ కేంద్రాన్ని కొంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు . ఈ కేంద్రాన్ని పీసీబీ అధికారులు బుధవారం ప్రారంభించనున్నారు . కాలుష్య నియంత్రణ మండలి ( పీసీబీ ) ఆధ్వర్యంలో , రీ - సైక్లింగ్ సంస్థ సహకారంతో నడిచే ఈ కేంద్రాల ద్వారా ఈ వ్యర్థాలను సేకరించనున్నారు . త్వరలోనే గచ్చిబౌలి , సనత్నగర్ , మల్కాజిగిరి ప్రాంతాల్లో సైతం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి , వాటి పనితీరును బట్టి మరికొన్ని సెంటర్లను నగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు . గతంలో ప్రైవేట్ రంగంలో నగరంలో 15 సంస్థలకు సేకరించుకొనే అవకాశం కల్పించినా , వ్యర్థాలను వేరుచేయడానికి 8 కేంద్రాలు , మరో మూడు ఈపీఆర్ కేంద్రాల ఏర్పాటు చేశారు . అయితే వీటి ఏర్పాటు వల్ల ప్రయోజనం లేకపోవడంతో పీసీబీ అధికారులే నేరుగా రంగంలోకి దిగారు . వెల్త్ అవుటాఫ్ వేస్ట్ ( వ్యర్థాల నుంచి ఆదాయం ) నినాదంతో విస్త్రత ప్రచారం చేయనున్నారు . తొలి కేంద్రాన్ని కొంపల్లిలోని బృందావన్ కాలనీ శ్రీకాంత్ హైటెన్ నర్సరీలో ఏర్పాటు చేస్తున్నారు . వ్యర్థాల సేకరణ కోసం 040 49171143 నంబర్ కు ఫోన్ చేయవచ్చు . ఫోన్ చేస్తే తీసుకువెళ్లారు .
wastage
పాడయిపోయిన , పాతకంప్యూటర్లు ల్యాబ్ టాప్లు , మెల్ ఫోన్లు , ట్యాబ్లు , వీడియోగేమ్ పరికరాలు , స్టీరియోలు , టేప్ రికార్డర్లు , వాక్ మెన్ , కెమెరాలు , రిఫ్రిజిరేటర్లు , వాషింగ్ మిషన్లు , ఎయిర్ కండిషనర్లు , ప్లాస్టిక్ బాటిళ్లు , ప్లాస్టిక్ కంటెయినర్లు , ప్లాస్టిక్ , ప్యాకేజింగ్ సామగ్రిని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకెళతారు . భవిష్యత్తులో వ్యర్థాలు మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయి . ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ( సీపీసీబీ ) ఈ వేస్ట్ మేనేజ్ మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2001 , ప్లాస్టిక్ వేస్ట్ హ్యాండ్లింగ్ రూల్స్ పేరుతో చట్టాలను తీసుకొచ్చింది . అయితే దీనిని పటిష్టంగా అమలు చేయకపోవడంతో 2012 మే 1 నుంచి బలవంతంగానైనా అమలు చేయాల్సిందేనని సీపీసీబీ ఆదేశించింది . ఈ చట్టం ప్రకారం వ్యర్థాల నిర్వహణకు సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పొందుపరిచింది . మెట్రో , ఐటీ రాజధానులుగా వెలుగొందుతున్న బెంగళూరు . పుణె , ఢిల్లీ , ముంబై నగరాల్లో ఇదే తరహాలో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ వ్యర్థాలను విజయవంతంగా సేకరిస్తున్నారు . అక్కడి విధానాన్ని పరిశీలించిన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నారు . మొదటి దశలో కాలనీవాసులే తీసుకొచ్చి వ్యర్థాలను సెంటర్ వద్దకు చేర్చాల్సి ఉండగా , రెండో దశలో కలెక్షన్ సెంటర్ వద్ద వ్యర్థాలను రవాణా చేయడానికి ఆటో ట్రాలీలను అందుబాటులో ఉంచనున్నారు . ఫోన్ చేస్తే . . పీసీబీ సిబ్బందియే వచ్చి ఈ వ్యర్థాలను తీసుకెళతారు . కుప్పలు తెప్పలుగా హైదరాబాద్ లో ప్లాస్టిక్ , ఎలకానిక్ వ్యరాలు భారీగా పోగవుతున్నాయి . కుప్పలు తెప్పలుగా హైదరాబాద్ లో ప్లాస్టిక్ , ఎలక్ట్రానిక్ వ్యర్థాలు భారీగా పోగవుతున్నాయి . కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి . నగరాన్ని మొత్తంగా కాలుష్య కూపంగా మార్చేస్తున్నాయి . 2016 - 17 సంవత్సరానికి గాను 28 , 749 మెట్రిక్ టన్నులు వ్యర్థాలు పోగయినట్లు ఎన్విరాన్ మెంట్ ప్రొటెక్షన్ టైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( ఈపీటీఆర్ఐ ) అధ్యయనంలో తేలింది . 2014 - 15లో 3739 మెట్రిక్ టన్నులుగా ఉన్న వ్యర్థాలు ఒకే ఏడాదిలో 28 వేలకు చేరడం ఆందోళనకరంగా మారింది . ఇక రాబోయే రోజుల్లో వ్యర్థాల మరింతగా పోగవుతాయని.

2021 - 22 సంవత్సరానికి 50 , 335 టన్నులకు చేరుకొనే ప్రమాదం ఉందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయిఈ వ్యర్థంతో ముప్పే . . హెచ్ఎండీఏ పరిధిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ( ఈ వ్యర్థాల ) ఉత్పత్తి అత్యధికంగా ఉంది . ఒక వ్యక్తి ఏడాదికి 2 . 09 ఈ వ్యర్థాలకు కారణమవుతున్నాడు . హెచ్ఎండీఏ పరిధిలో వెలువడుతున్న ఈ వ్యర్థాల్లో 70 శాతం గృహోపకరణాల నుంచి వెలువడుతుండగా , 30 శాతం బల్క్ కస్టమర్ల నుంచి వెలువడుతున్నది . ఇది వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అధికంగా వెలువడగా , 10 ఏండ్ల నుంచి ప్రైవేట్ సంస్థల నుంచి అధికమవుతున్నది . 2009లో 75 శాతం ప్రభుత్వ రంగం సంస్థల నుంచి ఉంటే , తాజాగా 70 శాతం విద్య , బ్యాంకింగ్ , వైద్య రంగ సంస్థల నుంచి అధికంగా పోగవుతున్నది . హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్న ఈ వేస్ట్లో కేవలం 10 శాతం మాత్రమే రిసైక్లింగ్ కు నోచుకుంటున్నది . నగరంలోని 70 లక్షల సెల్ ఫోన్లలో ఏటా 25 శాతం చెత్తకుప్పల పాలవుతున్నాయి . పక్కాగా సేకరణ . . వ్యర్థాల నిర్వహణపై అవగాహన లేక పక్కదారిపడుతున్నాయి . అసంఘటిత రంగంలోనే సేకరణ కొనసాగుతున్నది . ర్యాగోపిక్కర్లు . . చెత్తసేకరణ కార్మికులు ఈ వ్యర్థాలను కాల్చివేస్తున్నారు . ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారం లభిస్తుండటంతో వాటిని భస్మం చేస్తున్నారు . కంప్యూటర్ సీపీయూ మదర్ బోర్డ్లు , సెల్ ఫోన్లలో సిలికాన్ చిప్పులలో బంగారం లభిస్తున్నది . అశాస్త్రీయంగా కాల్చివేస్తుండటంతో వీటి నుంచి కాలుష్యం వెలువడుతున్నది .

వ్యర్థాల నిర్వహణ . . యాజమాన్య పద్ధతుల్లో లోపాలతో | అనర్థదాయకంగా మారుతున్నది . తెలియకుండా కాల్చిన పాపానికి కాన్సర్ ను మోసుకొస్తుంది . దేశవ్యాప్తంగా ఈ వేస్ట్ ను ఉత్పత్తిచేస్తున్న నగరాల్లో హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉన్నట్లుగా వెల్లడయ్యింది . ఈ వ్యర్థాల సేకరణ అడ్డ దిడ్డంగా ఉండటంతో వ్యర్థాలన్నీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్లోనే కలిపివేయడంతో డంపింగ్ యార్డులకు చేరుతున్నది . అక్కడ చెత్తతో పాటు ఈ వేస్ట్లను తగులబెడుతుండటంతో ప్రమాదకర వాయువులు గాల్లో కలిసిపోతున్నాయి . డంపింగ్ యార్డుల్లో చేరుతున్న ఈ వేస్ట్ కాల్చివేతలతో చెత్త సేకరిస్తున్న మహిళలు , పిల్లలపై ప్రభావం తీవ్రంగా ఉంది . తాజాగా పీసీబీ చేపట్టిన ప్రయోగం ఫలితంగా సేకరణ పక్కాగా చేపట్టనున్నారు . రోజూ 500 టన్నుల ప్లాస్టిక్ . . నగరంలో ప్లాస్టిక్ వస్తువులు , కవర్లు సైతం కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి . ప్రతి రోజు 450 - 500 టన్నుల ప్లాస్టిక్ పోగవుతున్నది . మన నగరవాసులు ప్రతి రోజు 100 మిలియన్ల బాటిళ్లను పారేస్తున్నారు . భూమిలో కలిసిపోయే స్వభావం లేని ఈ ప్లాస్టిక్ గుదిబండగా మారి . . నాలాలు , భూగర్భడైనేజీ మార్గాలను మూసేస్తున్నాయి . ఫలితంగా వరదలు , మురుగునీరంతా రోడ్లపై పొంగిపొర్లుతున్నది . ఇక వీటిని కాల్చివేస్తుండటంతో ప్రమాదకర వాయువులు వెలువడి , ఈ గాలిని పీల్చుకుంటే కాన్సర్ సోకుతున్నది . ప్లాస్టిక్ కవర్లను తినడంతో ఆవులు , పశువులు మృత్యువాతపడుతున్నాయి .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :